జగనన్న విద్యాదీవెన పంపిణీ

జగనన్న విద్యాదీవెన మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు, తదితరులు

            పుట్టపర్తి అర్బన్‌ : జగనన్న విద్యాదీవెన కింద జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 34,169 మంది విద్యార్థులకు రూ.23.84 కోట్ల ప్రభుత్వం సాయం అందించారు. జగనన్న విద్య దీవెన ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన త్రైమాసిక పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శుక్రవారం నాడు కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ అరుణ్‌బాబు, మున్సిపల్‌ ఛైర్మన్‌ తుంగ ఓబుళపతి, వైస్‌ ఛైర్మన్‌ మాతంగి తిప్పన్న, పుడా చైర్‌పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శివరంగ ప్రసాద్‌, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేందుకు తల్లితండ్రులకు ఇబ్బందులు పడకూడదన్న ఉద్ధేశంతో ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన సాయాన్ని అందిస్తోందన్నారు. ఈ సాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్‌ ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులకు మెగా చెక్కును అందజేశారు.

➡️