జనసేనలో పలువురు చేరిక

Feb 11,2024 22:10

పార్టీలోకి చేరిన వారితో చిలకం మధుసూదన్‌రెడ్డి

                 ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని కొత్తపేటకు చెందిన 10 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరాయి. జనసేన పార్టీ నాయకులు చిలకం మధుసూదన్‌రెడ్డి స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తపేటకు చెందిన షేక్‌ మహబూబా బాషా, దేవరకొండ కాశీ, బోయ నాగేశ్‌ , వసంతం నాగేశ్‌, దాసరి కిరణ్తో పాటు పలువురు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికి చిలకం మధుసూదన్‌రెడ్డి పార్టీ కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రదానకార్యదర్శి బెస్తశ్రీనివాసులు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గొట్లూరు జీవి, కార్యనిర్వాహణ కమిటి సభ్యులు పేరూరు శ్రీనివాసులు, బండ్లచంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️