టిడిపిలో పలువురు చేరిక

Jan 16,2024 22:08

 టిడిపిలోకి చేరిన వారితో గుండుమల తిప్పేస్వామి, తదితరులు

                     మడకశిర : నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గుడిబండ మండలం కొంకల్లు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు, మాజీ ఉప సర్పంచి నరసింహమూర్తి, కెంపన్న, హనుమంతరయప్ప, తిప్పేస్వామి, అరుణ్‌ కుమార్‌, లక్ష్మన్నతో పాటు 15 కుటుంబాలకు చెందిన సభ్యులు, మడకశిర మండలం హరేసముద్రం గ్రామానికీ చెందిన వైసిపి నాయకుడు ఆనంద్‌, ఈరమలప్ప ఆధ్వర్యంలో 10 కుటుంబాల సభ్యులు, పట్టణానికి చెందిన ప్రసాద్‌, అతని అనుచరులు వైసిపికి రాజీనామా చేసి గుండుమల తిప్పేస్వామి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ మూర్తి పట్టణ కన్వీనర్‌ మనోహర్‌, నాయి బ్రాహ్మణ సాధికారిక కన్వీనర్‌ రామాంజనేయులు, కల్లుమరి సర్పంచి గంగమ్మ నాగరాజు, బెగార్లపల్లి రవికుమార్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️