ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు

Mar 26,2024 22:10

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

                   పుట్టపర్తి రూరల్‌ : ఎన్నికల సమయంలో ప్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలపై నిఘా ఉంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మాధవ్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పోలీస్‌ వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ల పై పోలీసులు నిఘా ఉంచాలన్నారు. డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు నేర నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర సిసి కెమెరాలతో పకడ్బందీ నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసు బలగాలతో రూట్‌ మార్చ్‌, ప్లాగ్‌ మార్చ్‌ చేయించాలని గన్‌ లైసెన్సులను అన్నింటిని డిపాజిట్‌ చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విష్ణు, డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

➡️