మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి : యుటిఎఫ్‌

Dec 5,2023 22:20

 నిరసన చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

      ధర్మవరం టౌన్‌ : మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అప్‌గ్రేడ్‌ అయినఉన్నతపాఠశాలల్లో హెచ్‌ఎంలతో సహా అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలన్నారు. మున్సిపల్‌ పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఇఒ రాజేశ్వరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ధర్మవరం పట్టణ అధ్యక్షులు హరికృష్ణ, ప్రధానకార్యదర్శి పోసా సాయిగణేశ్‌, నాయకులు లక్ష్మయ్య, రాంప్రసాద్‌, బిల్లే రామాంజినేయులు, బాలగొండ్ల ఆంజనేయులు, రామాంజినేయులు, మేరీ వరకుమారి, లతాదేవి, ఆదిశేషు, నాగేంద్రమ్మ, హనుమంతు, జనార్దన్‌, గోపాల్‌రెడ్డి, కృష్ణతేజ, కృష్ణకిశోర్‌, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️