యుటిఎఫ్‌ జిల్లా కమిటీలో ధర్మవరం నాయకులు

Dec 4,2023 21:40

 యుటిఎఫ్‌ జిల్లా కమిటీలో ధర్మవరం జోన్‌ నాయకులు

         ధర్మవరం టౌన్‌ : సత్యసాయిజిల్లా యుటిఎఫ్‌ కార్యవర్గంలోకి ధర్మవరం జోనల్‌ నాయకులకు స్థానం కల్పించినట్లు ఆ శాఖ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎన్జీవో హోంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా రమీజాబీ, జిల్లాఆడిట్‌ సభ్యులుగా రమావత్‌ రామకృష్ణ నాయక్‌, పెద్దకోట్లసురేశ్‌, ఆది నారాయణ, మున్సిపల్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌గా బిల్లే రామాంజినేయులు, క్రీడా సబ్‌కమిటీ కన్వీనర్‌గా సకల చంద్రశేఖర్‌, సాంస్కృతిక సబ్‌ కమిటీ కన్వీనర్‌గా వినరుకుమార్‌కు చోటు కల్పించామన్నారు. వీరికి జిల్లా కమిటీలో చోటు దక్కడం పట్ల యుటిఎఫ్‌ పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు హరికృష్ణ, సాయిగణేశ్‌, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆంజనేయులు, జనార్దన్‌, రామగిరి మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శివయ్య, వినరు, సీకేపల్లి మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కెఎం. నబీ, అమర్నాథ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.నేడు తహసీల్దార్‌ కార్యాలయ ఎదుట ధర్నా : మున్సిపల్‌ ఉపాధ్యాయుల పరిష్కారం కోసం యుటిఎఫ్‌ దశల వారి పోరాట కార్యాచరణలో భాగంగా మంగళవారం సాయత్రం 4గంటలకు ధర్నా నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించాలని, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల సాధనకు ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.

➡️