16న ప్రధాని రాక

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

          గోరంట్ల రూరల్‌ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి రానున్నారని కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. పాలసముద్రంలో గల నాసిన్‌ కంపెనీ భవన సముదాయాలను ప్రధాని ప్రారంభిస్తారన్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో నాసిన్‌ కంపెనీ ప్రాంతాన్ని కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవరెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవన సముదాయాలను పరిశీలించి, అక్కడి అధికారులతో మాట్లాడారు. ప్రధాని పర్యటన నేపథ్యంలోని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ తెలియజేశారు.

➡️