రాగిపంట కోత కోసిన బాలయ్య సతీమణి

Apr 15,2024 22:20

కూలీలతో కలసి రాగిపంట కోత కోస్తున్న నందమూరి వసుంధరదేవి

                  చిలమత్తూరు : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరదేవి మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు పొలంలో రాగిపంట కోత కోశారు. ఈ మేరకు ఆమె సోమవారం మూడవరోజు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని మరువకొత్తపల్లి, లక్ష్మీపురం, వెంకటాపురం, వీరాపురం, ఆదేపల్లి, పాతచామలపల్లి, సంజీవరాయినిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై నుంచి ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానంగా మహిళా ఓటర్లను కలుసుకొని బాలకృష్ణ ను మూడోసారి గెలిపించాలని కోరారు. ఈ మేరకు వసుంధర దేవి వెంకటాపురం గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో రాగి చేను కోస్తున్న కూలీలను చూసి అక్కడికి వెళ్లారు. కూలీలతో పాటు రాగి చేను కోసి ఓట్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యాక్రమంలో నందమూరి బాలకృష్ణ సోదరి లోకేశ్వరి, అల్లుడు భరత్‌, ఐటి వింగ్‌ తేజశ్వినితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️