హాల్‌ టికెట్లు పంపిణీ

May 15,2024 21:37

హాల్‌టికెట్‌ అందజేస్తున్న ఆర్డీటీ ప్రతినిధు

                 మడకశిర : నియోజకవర్గ పరిధిలోని రొళ్ల మండల కేంద్రంలోని ఆర్డీటీ ప్రాంతీయ కార్యాలయంలో రొళ్ల, అగళి, మండలాలకు చెందిన పది పాసై ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు బుధవారం హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. దరఖాస్తు చేసుకున్న 46 మంది విద్యార్థులకు ఎటిఎల్‌ ఓబుళేసు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. వీరికి ఈ నెల 19న హిందూపూర్‌ బస్టాండ్‌ సమీపంలో గల ఎన్‌ఎస్‌ పీఆర్‌ మహిళ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్ష లో మంచి ప్రతిభ కనపరిచే విద్యార్థులకు ఆరు సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్‌ తరహాలో ఎంపిక చేసుకున్న పాఠశాలలో ఉన్నత విద్యకు అవకాశం కలిస్తున్నట్లు ఏటీఎల్‌ ఓబులేసు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది హనుమంతరాయుడు, శివప్రసాద్‌, వెంకటేశులు, విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.

➡️