పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించాలి

Jun 27,2024 21:58

సమావేశంలో పాల్గొన్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

                 హిందూపురం : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలను అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాద్యాక్షులు బాబావలి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక బిసి వసతి గృహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బాబావలి మాట్లాడుతు పాఠశాలలు ప్రారంభించి పక్షం రోజులు కావస్తున్నా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలను సరఫరా చేయని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వెంటనే పెండింగ్‌ లో ఉన్నా పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, తరుణ్‌, జస్వంత్‌, మంజునాద,¸్‌ అమ్రేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️