కార్పొరేట్‌ కంపెనీలకు పాలకులు ఊడిగం : సిఐటియు

Jun 29,2024 21:54

సమావేశంలో మాట్లాడుతున్న జిఎల్‌. నరసింహులు 

                    కదిరి టౌన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు అన్యాయం చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌. నరసింహులు విమర్శించారు. శనివారం పట్టణంలోని ఎన్‌జిఒ హోంలో సిఐటియు పట్టణ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన జిఎల్‌ నరసింహులు హాజరై మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా సిఐటియు ఐక్యత పోరాటం అనే నినాదంతో అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేస్తూ అనేక పోరాటాలను నిర్వహిస్తోందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మికుల పొట్ట కొడుతూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులు పట్ల అనుసరించిన నియంతృత్వం విధానాలను తిప్పికొడుతూ ప్రజలు వైసిపికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. అనంతరం సిఐటియు పట్టణ కమిటీని 23 మందితో ఏర్పాటు చేశారు.కన్వీనర్‌గా ఎస్‌ జగన్‌ మోహన్‌, కో కన్వీనర్లుగా రామ్మోహన్‌, ముస్తాక్‌, మాబున్నీసాతో పాటు 19 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️