చేనేత కార్మికుడు ఆత్మహత్య

వరప్రసాద్‌(పైల్‌ఫొటో)

         ధర్మవరం టౌన్‌ : మరమగ్గాల ద్వారా తయారు చేసిన చీరలు అమ్ముడుపోక మనస్తాపంతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శుక్రవారం నాడు చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు… పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన వరప్రసాద్‌ (30) బీటెక్‌ పూర్తి చేశాడు. ఆయన చదువుకు సరిపడా ఉద్యోగం రాకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తం ధర్మవరంలో మరమగ్గాలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం చీరలకు అన్‌సీజన్‌ కావడంతో గిరాకీ పూర్తిగా తగ్గింది. ఎంతో నమ్మకంతో వేసిన మరమగ్గాల్లోనూ ఆదాయం రాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై శుక్రవారం ఉదయం గుట్టకిం దపల్లి రైల్వేట్రాక్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే కీమెన్‌ రైలు పట్టాల వద్ద పడి ఉన్న మృతదేహాన్ని చూసి రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని వద్ద ఆధారాల వల్ల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుం బసభ్యులు వరప్రసాద్‌ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యవంతం అయ్యారు. మతునికి భార్య, ఒక కుమార్తె ఉంది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలియజేశారు.

➡️