కన్నుల పండుగలా ఖాద్రిసుడి రథోత్సవం 

Mar 30,2024 15:17 #sri satyasai district

ప్రజాశక్తి-కదిరి టౌన్ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఖాద్రిసుడి బ్రహ్మరథోత్సవం లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగలా సాగింది. రథం సజావుగా సాగేందుకు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ఏవీ నరసింహాచార్యులు, పార్థసారథి చార్యులు రథం (తేరు )ముందు బలిహోరణ హోమం, నిత్య కైంకారాలు పూజా కార్యక్రమాలు అనంతరం 8 గంటలకు రథం ముందుకు సాగింది.

➡️