నియోజకవర్గ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Jun 27,2024 21:56

ఎమ్మెల్యేకు సమస్యలను విన్నవిస్తున్న స్థానికులు

                  మడకశిర : నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాననిఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో విజయవాడకు రెండు నూతన సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిపోలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం స్థానిక రహదారులు విశ్రాంతి భవనంలో నియోజకవర్గస్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక వైద్య విధాన పరిషత్‌ లో డాక్టర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు మేలైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా జులై 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్‌ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం సంత మార్కెట్‌ను పరిశీలించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం పట్టణంలోని యాదవ కళ్యాణమండపంలో అన్ని మండలాల ఎంపీడీవోలు సచివాలయ సిబ్బంది సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జులై 1 వ తేదీన జరుగు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షనర్‌ ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు. అంతకు ముందు మధుగిరి సర్కిల్‌ లోని కూరగాయల మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌ కు దారి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కూరగాయల విక్రయ దారులు దగ్గర అధిక సుంఖం వసూలు చేస్తే అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ మూర్తి, క్లాస్‌ 1 కాంట్రాక్టర్‌ గుండుమల జయప్ప, కన్వీనర్లు దాసిరెడ్డి, కుమారస్వామి, మనోహర్‌, లక్ష్మీనారాయణ, మద్దన కుంటప్ప,, గణేష్‌ నియోజకవర్గ టిడిపి నాయకులు అధికారులు సచివాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️