ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ దంపతులు

        పుట్టపర్తి అర్బన్‌ : క్రోధి నామ సంవత్సర ఉగాది జిల్లా ప్రజలకు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, విజయాలను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ పేర్కొన్నారు. క్రోధి నామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా కలెక్టరేట్లో స్పందన సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా మంగళ వాయిద్యాలు, మేల తాళాలతో దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ, ధర్మవరం ఆర్డీవో వెంకట శివ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు భమ్మిడిపాటి శ్రీనివాస శర్మ పంచాంగ శ్రవణంలోని సారాంశాన్ని తెలియజేశారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ సంస్కతి, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు వాటిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమమైన నూతన సంవత్సరంలో భగవంతుడు ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆనందోత్సవాలు నింపాలని ఆకాంక్షించారు. అన్నదాతలకు మేలు జరగాలని, దేశం ,రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివద్ధి పథంలో నిలిపేందుకు ఆయా ప్రభుత్వ శాఖ అధికారులు లక్ష్య సాధనలో భాగంగా సత్ఫలితాలు సాధించే దిశగా కషి చేయాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను విజయవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. డిఆర్‌ఒ కొండయ్య మాట్లాడుతూ తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు వంటి ఆరు రుచుల ఉగాది పచ్చడితో ఈ ఏడాది ప్రజలందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఎంపికైన జిల్లాలోని పలు ఆలయ అర్చకులు, వేద పండితులకు ప్రశంసాపత్రంను అందజేసి దుశ్యాలువతో జాయింట్‌ కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమల శాఖ జెడి పద్మమ్మ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, సిపిఒ విజయకుమార్‌ ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి రమేష్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారి అబ్దుల్‌ ఖయ్యూం, కలెక్టరేట్‌ ఏవో రామాంజనేయరెడ్డి, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, జిల్లా దేవాదాయ శాఖ అధికారి నరసింహ, పర్యాటకశాఖ అధికారి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

➡️