అర్హులందరికీ ఓటు హక్కు

18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్‌ఒలపై ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. ఓటర్ల ప్రత్యేక క్యాంపైన్‌ డే సందర్భంగా మండలంలోని

ఆమదాలవలస : దరఖాస్తులను పరిశీలిస్తున్న జెసి నవీన్‌

  • జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

ప్రజాశక్తి- ఆమదాలవలస, బూర్జ

18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత బిఎల్‌ఒలపై ఉందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ తెలిపారు. ఓటర్ల ప్రత్యేక క్యాంపైన్‌ డే సందర్భంగా మండలంలోని రామచంద్రాపురం, పొన్నాంపేట, దన్నానపేట, కొండపేట పోలింగ్‌ స్టేషన్లను శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా అవగాహనా సదస్సులో రాజకీయ పార్టీల నాయకులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. మార్పులు, చేర్పులు, డబుల్‌ ఎంట్రీలు, మృతుల ఓట్ల తొలగింపు దరఖాస్తులపై సమగ్ర విచారణ చేపట్టి బిఎల్‌ఒలు సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా విధులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈయన వెంట తహశీల్దార్‌ ఎస్‌.గణపతిరావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్‌ మురళీధర్‌నాయక్‌, మండల సర్వేయర్‌ బొడ్డేపల్లి గోవిందరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. బూర్జ మండలం కొండపేట పోలింగ్‌ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓటరు చేర్పులు, మార్పుల్లో ఎటువంటి విమర్శలకు తేవలేకుండా చూడాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు, తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించాలన్నారు. ఈయనతో పాటు తహశీల్దార్‌ రమణారావు, ఎన్నికల డిటి కె.కృష్ణ, విఎల్‌ఒ వి.గోవిందరావు ఉన్నారు.

 

➡️