ఆర్‌టిసి సేవలు విస్తృతం

ఆర్‌టిసి సేవలను విస్తృతం చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని ఆర్‌టిసి డిపో మేనేజర్‌

లక్కీ డ్రా తీస్తున్న చిన్నారి

డిపో మేనేజర్‌ సీతారాం నాయుడు

ప్రజాశక్తి- పలాసఆర్‌టిసి సేవలను విస్తృతం చేసేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రోణంకి సీతారాంనాయుడు అన్నారు. పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద గురువారం మూడు బస్సు రూట్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి రూట్‌లో పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, మాతల, రెండో రూట్‌లో పొత్తంగి, మూడో రూట్‌లో ఘూటి బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తమ బస్సు టిక్కెట్లను, ఫోన్‌ నంబర్లను రాశామని అన్నారు. ఇలా ప్రతి 15 రోజులకొకసారి లక్కీ డ్రా తీసేస్తున్నామని తెలిపారు. డ్రాలో ప్రతి రూట్‌లోనూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులు అందజేస్తామని చెప్పారు. వీరికి లక్కీ షాపింగ్‌ మాల్‌ గెలుపొందిన ప్రతి విజేతకూ రూ.వెయ్యి విలువ చేసే కూపన్‌ ఇస్తామని అన్నారు. వీటిని పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్దకు వచ్చి కూపన్లు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లక్కీ షాపింగ్‌ మాల్‌ మేనేజర్‌ శ్రీహరి, ఆర్‌టిసి ట్రాఫిక్‌ సిఐ పినకాన సంతోష్‌ కుమార్‌, ఉద్యోగులు డి.శ్రీనివాసరావు, సి.ఎం.రావు, కామరాజు, ధర్మారావు పాల్గొన్నారు. విజేతలు వీరేపాతపట్నం రూట్‌లో మొదటి బహుమతి బి.లోహిత్‌, ద్వితీయ బహుమతి వి.చిట్టి, ఘూటి రూటులో మొదటి బహుమతి సుజాత, రెండో బహుమతి భాగ్యలక్ష్మి, పొత్తంగి రూట్‌లో మొదటి బహుమతి బి.కురేష్‌, రెండో బహుమతి చంద్రశేఖర్‌ దక్కించుకున్నారు.

 

➡️