ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు

రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సీనియర్‌ న్యాయవాది నౌపడ విజరు

పోటీలను ప్రారంభిస్తున్న విజరు కుమార్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సీనియర్‌ న్యాయవాది నౌపడ విజరు కుమార్‌ ఆకాంక్షించారు. నిరంతరం సాధన చేస్తూ కోచ్‌ల వద్ద మెళకువలు నేర్చుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యాన నగరంలోని టౌన్‌ హాల్‌లో 37వ జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ కొర్గీ, 12వ జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ పూమ్‌ సే పోటీలను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్‌ కార్యదర్శి తైక్వాండో శ్రీను, ఫెన్సింగ్‌ అసోషిియేషన్‌ జిల్లా అధ్యక్షులు బలభద్రుని రాజాతో కలిసి పోటీలను ప్రారంభించారు. సబ్‌ జూనియర్‌ స్థాయి క్రీడాకారులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులు ఈనెల 20, 21 తేదీల్లో నంద్యాలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ కొర్గీ, పూమ్స్‌ సే విభాగాల్లో సత్తా చాటిన బాలబాలికలకు కేటగిరీల వారీగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, ధ్రువపత్రాలను అందజేశారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా మజ్జి గౌతమ్‌, పి.నవీన్‌, ఎన్‌.రవి, వి.జాస్మిన్‌, గణ సాయి, సాయి బాలాజీ, వి.మదన్‌, మేఘన, సమ్రిన్‌, జనార్థన్‌ వ్యవరించారు. ఎన్‌.శేఖర్‌ (టెక్కలి కోచ్‌), జగదీశ్వరరావు (కోచ్‌), రాహుల్‌ (కోచ్‌) రిఫరీలుగా వ్యవహరించారు.

 

➡️