ఉపాధి కల్పనలో నిర్లక్ష్యం వద్దు

Mar 5,2024 21:08

ప్రజాశక్తి-పోలాకి : మండలంలో వేతనదారులకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు హెచ్చరించారు. మంగళవారం ఎంపిడిఒ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో వేతనదారుల సంఖ్య తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోస్తా గ్రామంలో అటవీశాఖతో సమన్వయం చేసి, ఆ ప్రాంతాల వారికి కూడా పనులు కల్పించాలని సూచించారు. జాబ్‌ కార్డుదారులందరికీ 100 రోజులు పనులు కల్పించాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల పనివేళలు మార్పు చేయాలని, పని ప్రదేశాల్లో నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిడి మురళీకృష్ణ, ఎపిఒ రమణ, టెక్నికల్‌, ఫీల్డ్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️