ఉపాధ్యాయులను కించపరచడం తగదు

టెక్కలి ఎంఇఒ-1 దల్లి తులసీరావురెడ్డిను యుటిఎఫ్‌ నాయకులు బుధవారం కలిశారు. స్థానిక మండల రిసోర్స్‌ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయులపై ఎంఇఒ అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదన్నారు. మహిళా ఉపాధ్యాయులను కించపరిచేవిధంగా

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- టెక్కలి

టెక్కలి ఎంఇఒ-1 దల్లి తులసీరావురెడ్డిను యుటిఎఫ్‌ నాయకులు బుధవారం కలిశారు. స్థానిక మండల రిసోర్స్‌ కార్యాలయంలో పలు అంశాలపై చర్చించారు. ఉపాధ్యాయులపై ఎంఇఒ అనుసరిస్తున్న వైఖరి సమంజసంగా లేదన్నారు. మహిళా ఉపాధ్యాయులను కించపరిచేవిధంగా మాట్లాడడం సబబు కాదన్నారు. నిబంధనల మేరకు నాడు-నేడు పనులు చేపడుతుంటే… ఎంఇఒ జోక్యం చేసుకోవడంతో వివాదస్పదంగా మారుతుందన్నారు. పలువురు బాధిత ఉపాధ్యాయులు తమ వద్ద సమస్యలను విన్నవించుకున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంఇఒ సానుకూలంగా స్పందిస్తూ… ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిబంధనల మేరకు తాను విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని నాయకులు కోరగా, ఎంఇఒ సానుకూలంగా స్పందించారు. అనంతరం వినతిపత్రం అందించారు. సమావేశం ఎంఇఒ-2 దాసుపురం చిన్నారావు, యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు పడాల గణపతిరావు, ప్రధాన కార్యదర్శి తమ్మినేని వైకుంఠరావు, జిల్లా సహాయ కార్యదర్శి కురమాన దాలయ్య, సీనియర్‌ నాయకులు పాలవలస ధర్మారావు, దవళ వైకుంఠరావు, డి.లక్ష్మీనారాయణ, ఎన్‌.ప్రభావతి, మారం కుమారస్వామి, రోణంకి విజరుకుమార్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

➡️