ఎచ్చెర్ల బిజెపి అభ్యర్థిగా ‘ఎన్‌ఇఆర్‌’!

బిజెపితో టిడిపి పొత్తులో భాగంగా ఎచ్చెర్ల

 

ప్రజాశక్తి- రణస్థలం రూరల్‌

బిజెపితో టిడిపి పొత్తులో భాగంగా ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్‌ను బిజెపి నాయకులు నడుకుదిటి ఈశ్వరరావుకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ప్రకటన నేడో, రేపో విడుదల చేసే అవకాశం ఉంది. 2019 సాధారణ ఎన్నికల తరువాత టిడిపి నుంచి బిజెపిలోకి చేరారు. ప్రస్తుతం బిజెపి విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. మండలంలోని బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన వారు.

➡️