ఓటరు నమోదు కేంద్రాల పరిశీలన

మండలంలోని కె.కొత్తూరు పోలింగ్‌ కేంద్రాన్ని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలించి బిఎల్‌ఒలకు పలు సూచనలు చేశారు. మెళియాపుట్టి : మండలంలోని మెళియాపుట్టి, చాపర పోలింగ్‌ కేంద్రాలను జెడ్‌పి

టెక్కలి రూరల్‌ : రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమల్‌

టెక్కలి రూరల్‌: మండలంలోని కె.కొత్తూరు పోలింగ్‌ కేంద్రాన్ని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితాను పరిశీలించి బిఎల్‌ఒలకు పలు సూచనలు చేశారు. మెళియాపుట్టి : మండలంలోని మెళియాపుట్టి, చాపర పోలింగ్‌ కేంద్రాలను జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌ పరిశీలించారు. నూతన ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని బిఎల్‌ఒలకు సూచించారు. ఈయన వెంట తహశీల్దార్‌ పి.సరోజని, డిటి శంకరరావు, సత్యనారాయణ ఉన్నారు. బూర్జ: మండలంలోని లాభాం పంచాయతీకి సంబంధించిన 244, 245 పోలింగ్‌ బూత్‌లనుతహశీల్దార్‌ రమణారావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బిఎల్‌ఒలు ఎటువంటి విమర్శలకు తావి వ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని ఆదే శించారు. ఆయనతో పాటు బిఎల్‌ఒ రామచంద్రరావు, సిబ్బంది ఉన్నారు.జి సిగడాం: ఓటర్ల జాబితాలో తప్పులుంటే చర్యలు తప్పవని తహశీల్దార్‌ వేణుగోపాలరావు హెచ్చరించారు. మండలంలో పెంట, నాగులవలస, సీతంపేట, మెట్టవలస, ఎస్‌పిఅర్‌ పురం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. మరణించిన వారి ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే తొలగించాలని బిఎల్‌ఒలకు ఆదేశించారు. ప్రతి ఓటరుకి ఇంటి నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. తుది ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రామచంద్రరావు, పెంట సర్పంచ్‌ పున్నాన అప్పలనాయుడు, బిఎల్‌ఒలు, నాయకులు పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: ఓటరు నమోదుకు యువత ముందుకు రావాలని తహశీల్దార్‌ అప్పలస్వామి అన్నారు. మండలంలోని ఒండ్రుకుడియా, బెండి, కిడిసింగి, డోకులపాడు, రిట్టపాడు పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అక్కడ నమోదవుతున్న కొత్త ఓటర్లు వివరాలను దరఖాస్తులను ఆయన పరిశీలించారు. మండల వ్యాప్తంగా కొత్తగా ఓటు హక్కు కోసం 61మంది దరఖాస్తు తీసుకున్నారని తెలిపారు. ఓటు హక్కు తొలగింపు కోసం 26 దరఖాస్తులురాగా, వివరాలు సవరించాలంటూ 188 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో రీసర్వే తహశీల్దార్‌ వనిత, బిఎల్‌ఒలు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

 

➡️