ఓటింగ్‌ ప్రక్రియపై శిక్షణ

సార్వత్రిక ఎన్నికల్లో ఇవిఎంలు, వివి ప్యాట్స్‌ కనెక్షన్లు, బ్యాలెట్‌

శిక్షణ ఇస్తున్న జిల్లాస్థాయి బృందం అధికారులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఇవిఎంలు, వివి ప్యాట్స్‌ కనెక్షన్లు, బ్యాలెట్‌ యూనిట్లు సెట్టింగ్‌ను తనిఖీ చేసుకోవాలని జిల్లాస్థాయి ముఖ్య శిక్షణ బృందం అధికారులు ఎం.కిరణ్‌ కుమార్‌, బాలాజీ నాయక్‌, శేషగిరిలు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో బాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాట్స్‌ మిషన్‌ వినియోగంపై గురువారం శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఓటర్స్‌ స్లిప్‌, ఫారమ్‌లు 17-ఎ, 17-బి, 17-సి, 14, 14-ఎ, ఎం-21, మాక్‌ పోల్‌ ధ్రువపత్రం, డిక్లరేషన్‌ ఫారమ్‌ వంటి అవసరమైన ఫారాలను పూరించడంపై ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో డిస్పాచ్‌ సెంటర్‌లో కార్యకలాపాలు, పోలింగ్‌ స్టేషన్లలో ఏర్పాట్లు, పోలింగ్‌ ప్రారంభం విధానాలు, క్లోజర్‌ ప్రోటోకాల్‌లు, పోలింగ్‌ అనంతరం యంత్రాల సీలింగ్‌, మెటీరియల్‌ల సీలింగ్‌, ఈవిఎం, వివి ప్యాట్‌ ల నిర్వహణపై కూడా చర్చించారు. పోలింగ్‌ ప్రారంభించడానికి ముందు, పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్‌ ప్రారంభానికి ముందు తప్పనిసరిగా ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించాలన్నారు. పోలింగ్‌ ప్రక్రియ, మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను గురించి అందించిన బుక్‌ లెట్‌లోని ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా చవాల న్నారు. విధి నిర్వహణలో ఎలాంటి అవరోధాలు లేకుండా పనిచేయా లని సూచించారు. పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల న్నారు. శిక్షణలో మొత్తం 130 మంది ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులు హాజరయ్యారు. వారికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌, ఆడియో వీడియోల ద్వారా ఒక్కరోజు శిక్షణను పూర్తి చేశారు.

 

➡️