కిడ్నీ ఆస్పత్రి ప్రారంభానికి నిర్లక్ష్యమెందుకు?

Nov 23,2023 21:47
కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్దాన ఆరోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు బి.ఓంకార్‌, ప్రజా సంఘాల నాయకులు బి.ఆనందరావు, ఎన్‌.మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ కిడ్నీ ఆస్పత్రిని గురువారం వారు సందర్శించారు. అనంతరం వారు

మాట్లాడుతున్న ఓంకార్‌

ప్రజాశక్తి- పలాస

కిడ్నీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉద్దాన ఆరోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు బి.ఓంకార్‌, ప్రజా సంఘాల నాయకులు బి.ఆనందరావు, ఎన్‌.మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ కిడ్నీ ఆస్పత్రిని గురువారం వారు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ కిడ్నీ ఆస్పత్రికి సంబంధించి వైద్యులు, టెక్నీషియన్స్‌ ఇతర సిబ్బందిని నియమిస్తున్నామని జిఒ నంబరు 102ను 2019 సెప్టెంబరు 3న విడుదల చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క పోస్టు నియమించలేదని అన్నారు. తక్షణమే పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. 200 పడకలకు 3 షిప్ట్‌ల్లో పనిచేయడానికి ప్రభుత్వం పేర్కొన్న 31 మంది డాక్టర్లు సంఖ్య సరిపోదని అన్నారు. దీనిని కనీసం రెట్టింపు నియామకాలు చేపట్టాలన్నారు. కిడ్నీ రోగాలకు మూలాల కనుక్కోవడానికి విస్తృత పరిశీలన చేపట్టాలన్నారు. అందుకు తగ్గ నిపుణులును రెగ్యులర్‌ బేస్‌లో నియమించి పరిశీలనకు తగ్గ మెడికల్‌ పరికరాలు సమకూరాలన్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ కోసం రాను పోనూ ఛార్జీలు, భోజనం తదితర ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోవడం లేదని, రూ.20 వేలు చెల్లించాలని కోరారు. పౌష్టిక ఆహారం లేక కిడ్ని రోగులు నీరసించిపోతున్నారని, ఇట్లాంటి వారిని గుర్తించి పాలు, గుడ్లు పౌష్టికాహారం ప్రభుత్వమే సమకూర్చలని డిమాండ్‌ చేశారు.

 

➡️