ఘనంగా గణతంత్ర వేడుకలు

రిపబ్లిక్‌ డే వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగుర వేసి దేశభక్తిని

శ్రీకాకుళం అర్బన్‌ : పతాకావిష్కరణ తర్వాత సెల్యూట్‌ చేస్తున్న జెసి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

రిపబ్లిక్‌ డే వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో జెండాను జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, ఉప కలెక్టర్‌ పద్మావతి, ఆయా విభాగాల పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా న్యాయస్థానంలో జునైద్‌ అహమ్మద్‌ మౌలానా, ఎస్‌పి కార్యాలయంలో ఎస్‌పి రాధిక పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పిలు విఠలేశ్వర్‌, తిప్పే స్వామిలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సిఇఒ ఆర్‌.వెంకటరామన్‌ జెండాను ఎగుర వేశారు. ఆయనతో పాటు జెడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఎగుర వేశారు. జిల్లా వైసిపి కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ జెండాను ఆవిష్కరించారు. జిల్లా టిడిపి కార్యాలయంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవితో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు పతాకాన్ని ఆవిష్కరించారు. డిపిఆర్‌ఒ కార్యాలయంలో డిఐపిఆర్‌ఒ కె.చెన్నకేశవరావు పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో డిపిఆర్‌ఒ కె.బాలమాన్‌ సింగ్‌, డివిజనల్‌ పిఆర్‌ఒ ఎన్‌.రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ప్రిన్సిపాల్‌ సురేఖ, మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్‌ సూర్యచంద్రరావు, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సంస్థ కార్యదర్శి బి.కుమార్‌ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయంలో డిసిసిబి ముఖ్య కార్య నిర్వహణ అధికారి డి.వరప్రసాద్‌ జెండాను ఎగురవేశారు. ఎచ్చెర్ల: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌ ప్రొ. కెవిజిడి బాలాజీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓఎస్‌డి సుధాకర్‌ బాబు, పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్‌ మోహనకృష్ణ చౌదరి, ఎఫ్‌ఓ ఆసిరినాయుడు, వెల్ఫేర్‌ డీన్‌ రవి, విద్యార్ధులు పాల్గొన్నారు.బూర్జ: మండలంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపిపి కర్నేన దీప ఎంపిడిఒ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ రమణారావు, అలాగే పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయం వద్ద, సచివాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జెడ్‌పిటిసి రామారావు, సర్పంచ్‌ అనురాధ చేపట్టారు. పలాస: పలాస ఆర్‌డిఒ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్‌డిఒ భరత్‌ నాయక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు అవార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఒ పి బాల, పైల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌ నాయుడు, మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, వైస్‌ చైర్మన్‌ మీసాల సురేష్‌ బాబు పాల్గొన్నారు. మదర్‌ థెరీసా పాఠశాలలో పాఠశాల చైర్మన్‌ వజ్జ బాబూరావు, గౌతమ్‌ స్కూల్‌లో కరస్పాండెంట్‌ దుర్గా ప్రసాద్‌ పాత్రో ఆవిష్కరించారు. అనంతరం విద్యార్ధులు 75 ఆకారంలో కూర్చున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్‌ చిన్నం నాయుడు, సివిల్‌ జడ్జి కోర్టులో ఇన్‌ఛార్జి జడ్జి బిఎంఆర్‌ ప్రసన్న లత, కాశీబుగ్గ డిఎస్‌పి కార్యాలయంలో డిఎస్‌పి నాగేశ్వర్‌ రెడ్డి, జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ బాడ వెంకట మోహన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొత్తూరు: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఎం.పావని జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసీ వరప్రసాద్‌, ఎంపిపిఎస్‌ సావిత్రి, ఇఒపిఆర్‌డి కృష్ణారావు పాల్గొన్నారు.రణస్థలం: ఘనతంత్ర వేడుకలు సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ సనపల కిరణ్‌ కుమార్‌, సర్కిల్‌ కార్యాలయం వద్ద సిఐ జి.రామచంద్రరావు, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ ఆర్‌.వి.రమణమూర్తి, పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ పాల్గొని ప్రసంగించారు.మెళియాపుట్టి: మండలంలో పలుచోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తహశీల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ పి.సరోజిని, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ చంద్రకుమారి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ టి.రాజేష్‌ పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల వద్ద ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.ఆమదాలవలస పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో న్యాయమూర్తి ఎస్‌. మణి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి భారు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఎం. రవి సుధాకర్‌, జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేడాడ రామ్మోహనరావు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు జెండా ఎగరవేశారు.లావేరు: స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో తహశీల్దార్‌ సాధు దిలీప్‌ చక్రవర్తి, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ కుప్పిలి సురేష్‌ కుమార్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ కోటేశ్వరరావు జెండాను ఎగురవేశారు. మురపాకలోని కస్తూరిబా గాంధీ బాలికలు పాఠశాల వద్ద ప్రత్యేకధికారిణి సుధారాణి జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిపి లుట్ట అమ్మాజమ్మ, జెడ్‌పిటిసి ఎం. సీతంనాయుడు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి శ్రీనువాసురావు, మాజీ ఎంపిపి రాజీనాయుడు పాల్గొన్నారు. పోలాకి: మబగాము ప్రభుత్వ పాఠశాల, విశ్రాంత సైనిక ఉద్యోగులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన కష్ణదాస్‌, టిడిపి మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో డిటి శ్రీనివాసరావు, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఉషశ్రీ, వెలుగు కార్యాలయంలో ఎపిఎం జి.రాజారావు, ఎపి మోడల్‌ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ పైడ ప్రవీణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి ముద్దాడ బైరాగి నాయిడు జెండా ఆవిష్కరణ చేసారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కణితి కృష్ణారావు, ఆర్‌.త్రినాథరావు, సర్పంచ్‌ మజ్జి రమణమ్మ, లక్ష్మి నారాయణ, అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.కవిటి: మండలంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రగడపుట్టుగా ఎంపిపి పాఠశాల వద్ద వేడుకల్లో ఎమ్మెల్యే అశోక్‌ పాల్గొన్నారు. ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపిపి కడియాల పద్మ, ప్రకాష్‌, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ పూడి లక్ష్మణరావు, మండలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల వద్ద ప్రధాన ప్రధానోపాధ్యాయులు జెండా వందనం చేశారు.నందిగాం: మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వేడుకలు నిర్వహించారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ వైవి పద్మావతి, ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపిడిఒ రాజారావు, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ మహమ్మద్‌ అమిర్‌ అలీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు వై.హరిబాబు పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలుపొందూరు: మండలంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయమూర్తి జస్టిస్‌ బి.జ్యోత్స్న జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ వి.వి.ప్రసాద్‌, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ సీపాన హరిహరరావు జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపిపి కిల్లి ఉషారాణి, జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు పాల్గొన్నారు. లోలుగు కెజిబివిలో ప్రిన్సిపాల్‌ ఆర్‌.సౌమ్య, శ్రీవేద పాఠశాలలో డైరెక్టర్‌ బోడ బాబూరావు, సిస్టమ్‌ కళాశాలలో కరస్పాండెంట్‌ మొదలవలస మోహనరావు, కింతలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ జె.సునీత, ప్రాంతీయ పశువైద్యశాలలో పశువైద్యాధికారి డా.పి.యస్‌.జి.బాలకృష్ణ జెండా ఎగురవేశారు. టెక్కలి రూరల్‌ : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ చింతా లక్ష్మీబాయి, పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి మల్లేశ్వరరావు, అదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వివి. నాగేశ్వరరావు, ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నాగభూషణరావు, మదర్‌థెరిసా విద్యాసంస్థలో అధినేత నారాయణరావు, విశ్వజ్యోతి డిగ్రీ కళాశాలలో పి.స్టాలిన్‌, డిఎస్‌పి కార్యాలయం దగ్గర డిఎస్‌పి బాలచంద్రారెడ్డి, సర్కిల్‌ కార్యాలయంలో సిఐ సూర్యచంద్ర మౌళి, డిఎల్‌పిఒ కార్యాలయం వద్ద డిఎల్‌పిఒ ఐవి రమణ, పశుసంవర్ధ శాఖ కార్యాలయం వద్ద డాక్టర్‌ జయరాజ్‌, ఫెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రోణంకి రామచంద్రరావు జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఎంపిపి సరోజనమ్మ, సర్పంచ్‌ గొండెలి సుజాత, ఎంపిటిసిలు కూన పార్వతి, పీత హేమలత, వాకాడ శ్రీధర్‌ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.జి. సిగడాం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో డిటి ఎన్‌.నిర్మల, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ కె.నిశ్చల, పోలీస్‌స్టేషన్‌లో ఎఎస్‌ఐ రామకృష్ణ, మోడల్‌ స్కూల్‌లో, కెజిబివిలో, సంతవురిటి, బాతువ, దేవరవలస, సిగడాం హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు జెండా ఎగురవేశారు. మండలంలో అద్దానంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు విన్యాసాలు చేస్తూ అందరిని అలరించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్‌పిటిసి కాయల రమణ, ఎంఇఒ అరసాడ రవి, విఅర్‌ఒ, కార్యదర్శులు పాల్గొన్నారు.ఇచ్ఛాపురం: స్థానిక యు కాంప్లెక్స్‌ వద్ద మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యలయం వద్ద మాజీ ఆర్మీ అధికారి రామకృష్ణ రెడ్డి, విశ్వనాథ్‌ రెడ్డి, ఎల్‌.అర్‌.రెడ్డి, రెవెన్యూ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ గురు ప్రసాద్‌, ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ ఈశ్వరరావు, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ గోవిందరావు, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రమేష్‌, రవాణాశాఖ కార్యాలయం వద్ద రవాణాశాఖ అధికారి రంగారావు జెండా ఆవిష్కరించారు. స్వర్ణభారతి విద్యా సంస్థలో చైర్మన్‌ చాట్లా తులసీ దాస్‌ రెడ్డి, శాంతినికేతన్‌ విద్యా సంస్థలో చైర్మన్‌ దక్కత కృష్ణమూర్తి రెడ్డి, భారతి విద్యా సంస్థలో జోహర్‌ ఖాన్‌, జనసేన కార్యలయంలో ఇన్‌ఛార్జి దాసరి రాజు, వికె ఫంక్షన్‌ హాల్‌ వద్ద బిజెపి జిల్లా కార్యదర్శి వల్లంపాటి ప్రసాద్‌, ఒరియా స్కూల్‌లో వైస్‌ చైర్మన్‌ లాభాల స్వర్ణమణి జెండా ఎగురవేశారు. సంత బొమ్మాళి: ఉమిలాడ సచివాలయం వద్ద పిఎసిఎస్‌ చైర్మన్‌ కెల్లి జగన్నాయకులు, కార్యదర్శి కె.గోవింద్‌, జగన్నాథపురంలో సర్పంచ్‌ జోగి రాములమ్మ, నరసాపురంలో సర్పంచ్‌ దుక్క భూషణ రెడ్డి, కార్యదర్శి ఎస్‌. మల్లేశ్వరరావు, గోవింద పురంలో సర్పంచ్‌ రెయ్య రామి రెడ్డి, కార్యదర్శి ఎస్‌.డిల్లేశ్వరరావు, బోరు భద్రలో సర్పంచ్‌ బుస్కల లక్ష్మికాంతం, బోరుభద్ర పిహెచ్‌సి వద్ద మెడికల్‌ ఆఫీసర్‌ పీస అవని, కాపు గోదయ్యవలసలో సర్పంచ్‌ అంగ లక్ష్మి జనార్ధన్‌, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తహశీల్దార్‌ జె.చలమయ్య, సంతబొమ్మాళిలో సర్పంచ్‌ కళింగపట్నం లక్ష్మి, కార్యదర్శి కె.రాధారాణి జెండా ఆవిష్కరణ చేశారు. మలగాం సచివాలయం వద్ద అధికారులు జెండా ఎగుర వేయకపోవడంతో పలు విమర్శలకు తావిస్తుంది.వజ్రపుకొత్తూరు: మండలంలో తహశీల్దార్‌, పోలీస్‌స్టేషన్‌, ఎంపిడిఒ కార్యాలయాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అక్కుపల్లి బిసి గురుకుల పాఠశాల, గోవిందపురం ప్రాథమిక పాఠశాలల్లో జెండా ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రతినిధి పాలిన శ్రీనివాసరావు, తహశీల్దార్‌ అప్పలస్వామి, ఎంపిడిఒ ఈశ్వరమ్మ, ఎస్‌ఐ మధుసూదనరావు, ప్రిన్సిపాల్‌ పాపారావు పాల్గొన్నారు.టెక్కలి: టెక్కలి సబ్‌కలక్టర్‌ కార్యాలయంలో సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, పిఎసిఎస్‌ కార్యాలయంలో మేనేజర్‌ దాస్‌, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో ఎంవిఐ డి.సంజీవిరావు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో జడ్జి జె.శ్రీనివాసరావు, టిడిపి కార్యాలయంలో మండల అధ్యక్షులు బగాది శేషగిరి, జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి కణితి కిరణ్‌కుమార్‌, డిసిసి కార్యాలయంలో అధ్యక్షులు డాక్టర్‌ పేడాడ పరమేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో అధ్యక్షులు రోణంకి రామచంద్రరావు, ఎంఇఒ కార్యాలయంలో ఎంఇఒ దల్లి తులసీరావురెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోవిందమ్మ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలో ఓక్లాండ్‌ ఆంతర్జాతీయ పాఠశాల్లో విద్యార్దులు ప్రదర్శించిన వేషదారణలు పలువురుని ఆకట్టు కున్నాయి. రవీంద్రభారతి పాఠశాలలో వైద్యులు శ్రీనుబాబు పతాకాన్ని ఆవిష్కరించారు. బిఎస్‌జెఆర్‌ కళాశాల వద్ద కరస్పాడెంట్‌ మురళీధర్‌, జూనియర్‌ కళాశాల వద్ద ప్రిన్సిపాల్‌ కోత శ్రీనివాసరావు, ఆదర్శ పాఠశాల వద్ద ప్రిన్సిపాల్‌ సింహచలం, అమ్మఒడి పాఠశాల వద్ద కరస్పాడెంట్‌ బరాటం శ్రీనివాసరావు, విశ్వజ్యోతీ జూనియర్‌ కళాశాల వద్ద డైరెక్టర్‌ రవీంద్రకుమార్‌, ప్రణవి కళాశాల ఆవరణలో కరస్పాడెంట్‌ పేడాడ చంద్రశేఖర్‌ ఆజాద్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.కోటబొమ్మాళి: స్థానిక ఎంపిడిఒ కార్యాలయ అవరణలో ఇఒపిఆర్‌డి ఎస్‌.రామారావు, జూనియర్‌ సివిల్‌ కోర్టులో జూనియర్‌ సివిల్‌జడ్జి బిఎంఆర్‌ ప్రసన్నలత, టిడిపి కార్యాల యంలో మాజీ పిఎసిఎస్‌ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, ఎఎంసి కార్యాలయంలో ఎఎంసి చైర్మన్‌ సుగ్గు పుణ్యావతి జాతీయ జెండాను అవిష్కరించారు. పోలీస్‌స్టేషన్‌ అవరణలో ఎస్‌ఐ షేక్‌ మమ్మద్‌అలీ, చీపుర్లపాడు సచివాలయంలో సర్పంచ్‌ నేతింటి చిన్నమ్మడు అప్పలస్వామి జెండాను అవిష్కరించారు. మండలంలో అన్ని గ్రామ పంచాయతీల వద్ద, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద ఆయా యజమానులు జాతీయ జెండాను అవిష్కరించారు.

➡️