చదువుతో పాటు క్రీడలు అవసరం

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం చాపర జిల్లా పరిషత్‌

టెక్కలి : కబడ్డీ కూతకు వెళ్లిన వాణి

ప్రజాశక్తి- మెళియాపుట్టి

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం చాపర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో శారీరక ఉల్లాసానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో మరింత రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. అంతకుముందు సచివాలయ ఆవరణలో భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ చంద్రకుమారి, ఎంపిపి ప్రతినిధి బి.ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, మండల వైసిపి కన్వీనర్‌ పల్లి యోగి, సర్పంచ్‌ బోసి రామారావు, కరణం శశిభూషణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.టెక్కలి: స్దానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్రా పోటీలను టెక్కలి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి, జడ్‌పిటిసి దువ్వాడ వాణి ప్రారంభించారు. మండలంలోని 20 గ్రామ సచివాలయాల పరిధిలో 127 టీంలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎంపిపి అట్ల సరోజనమ్మ, ఎంపిడిఒ చింతాడ లక్ష్మీబారు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తెంబురు గోవిందమ్మ, ఎంఇఒ దల్లి వీరాస్వామి రెడ్డి, ఎంపిటిసి పీత హేమలత, ఉపసర్పంచ్‌ గండి విశ్వశాంతి రెడ్డి, సర్పంచ్‌లు గుజ్జు మోహన్‌రెడ్డి, కె.కామేశ్వరరావు, వైసిపి నాయకులు గండి అప్పలరెడ్డి పాల్గొన్నారు. పొందూరు: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఎంపిపి కిల్లి ఉషారాణి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆడదాం ఆంధ్ర మండలస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్‌, కబడ్డి, బ్యాడ్మింటైన్‌ పోటీల్లో మండలంలో పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు పప్పుల రమేష్‌ కుమార్‌, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, ఎంపిడిఒ సీపాన హరిహరరావు, ఎస్‌ఐ లక్ష్మణరావు, వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ బండారు జై ప్రతాప్‌ కుమార్‌, ఉప సర్పంచ్‌ అనకాపల్లి గోవిందరావు పాల్గొన్నారు.పలాస: క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ ఎన్‌ రమేష్‌ నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేంద్ర కుమార్‌ అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చినబడాం, మండలంలో బొడ్డపాడు, బ్రాహ్మణతర్ల, కాశీబుగ్గ క్రీడా మైదానంలో క్రికెట్‌, వాలీబాల్‌ మండలస్థాయి పోటీలను నిర్వహించారు. మండలంలో క్రికెట్‌ బ్రాహ్మణతర్ల, వాలీబాల్‌ బొడ్డపాడు, బ్యాట్మింటైన్‌లో అల్లుకోల గ్రామ యువకులు విజయం సాధించారు. నౌపడ: సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహించారు. నౌపడ, నరసాపురం సచివాలయాల్లో క్రీడాకారులకు ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పాల వసంత రెడ్డి, వైస్‌ ఎంపిపి ప్రతినిధి రామకృష్ణ, సర్పంచ్‌ మార్పు అశోక్‌ చక్రవర్తి, పిఎసిఎస్‌ సభ్యులు నాగభూషన్‌, కోటపాడు సర్పంచ్‌, ఎంపిటిసి ప్రతినిధి కోత సతీష్‌ పాల్గొన్నారు.వజ్రపుకొత్తూరు: అక్కుపల్లిలో ఆడుదాం ఆంధ్ర మండలస్థాయి పోటీలను వైసిపి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదరుకుమార్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సిహెచ్‌ ఈశ్వరమ్మ, సర్పంచ్‌లు డొంకాన విద్యాసాగర్‌, కొల్లి భాస్కరరావు, యువజన అధ్యక్షుడు యోగి, నరేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పైల గజేంద్ర, లోకేష్‌ పాల్గొన్నారు.ఇచ్ఛాపురం : స్థానిక సురంగి రాజా క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మున్సిపాలిటీ స్థాయి పోటీలకు నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి పిరియా సాయిరాజ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, జెడ్‌పిటిసి ప్రతినిధి ఉప్పడ రాజారెడ్డి, వైస్‌ ఎంపిపిలు దువ్వు వివేకానంద, దున్న గురుమూర్తి, టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌పట్నాయక్‌, టౌన్‌ జెసిఎస్‌ అధ్యక్షులు సాలిన ఢిల్లీరావు, మండల జెసిఎస్‌ అధ్యక్షులు ఆశి పురుషోత్తంరెడ్డి, దక్కత నూకయ్య, పి.చట్టిబాబు పాల్గొన్నారు. కవిటి: ఆడుదాం ఆంధ్రా మండలస్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కవిటి, శిలగాం వేదికల్లో బుధవారం జరిగిన క్రికెట్‌ పోటీల్లో మాణిక్యపురం, కవిటి-2, డి.జి.పుట్టుగ, బెలాగాం, శిలగాం, కపాసుకుద్ది జట్లు విజయం సాధించాయి. ఈ సందర్భంగా ఎంపిపి ప్రతినిధి కడియాల ప్రకాష్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పూడి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వం యువ క్రీడాకారులను గుర్తించే కోవలో ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాయకులు పూడి నీలాచలం, పాండవ చంద్రశేఖర్‌, ఎన్ని అశోక్‌, ఎఒ శ్రీనివాస్‌రెడ్డి, ఇఒ వీరభద్రస్వా మి, కార్యదర్శి మన్మథరావు, విఆర్‌ఒ నారాయణ పాల్గొన్నారు. కోటబొమ్మాళి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన మండలస్థాయి పోటీలను నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి ప్రారంభించారు. ఎంపిపి కుప్పిలి ఫణీంద్రకుమార్‌, వైస్‌ ఎంపిపిలు దుక్క రోజా, రామకృష్ణ, బోయిన నాగేశ్వరరావు సర్పంచ్‌ కాళ్ల సంజీవరావు పాల్గొన్నారు.నందిగాం : క్రీడాకారులు పోటీతత్వంతో మెలిగి ఉన్నత విజయాలు సాధించాలని కళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరాడ తిలక్‌ అన్నారు. నందిగాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్రా మండలస్థాయి క్రికెట్‌ పోటీలను ఎంపిపి నడుపూరు శ్రీరామ్మూర్తితో కలిసి ప్రారంభించారు. సర్పంచ్‌ జడ్యాడ జయరాం, ఎంపిటిసి అంబోడి విష్ణు, మండల పరిషత్‌ ప్రత్యేకాహ్వానితులు చిన్ని జోగారావు యాదవ్‌, ఎంపిడిఒ రాజారావు పాల్గొన్నారు.క్రీడాకారుల కొట్లాట టెక్కలి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ప్రారంభమైన మండలస్థాయి క్రీడా పోటీల్లో కబడ్డి క్రీడాకారులు కొట్టుకోవడం పలువురిని విస్మయానికి గురిచేసింది. క్రీడా పోటీలు ప్రారంభం అనంతరం రావివలస, పెద్దసాన జట్ల మధ్య కబడ్డి పోటీలు ప్రారంభమయ్యాయి. రావివలస జట్టు విజయం సాధిస్తున్న క్రమంలో ఆ జట్టులో ఉన్న ఒక క్రీడాకారుడుని పెద్దసాన జట్టు క్రీడాకారులు అనిచి వేయడం తట్టుకోలేని క్రీడాకా రుడు జట్టులోని ఒక వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. అయితే తాను క్రీడల్లో భాగంగా పాల్గొన్నా కానీ ఉద్దేశ్య పూర్వకంకాదని చెప్పినప్పటికీ ఇరువర్గాలు బాహాబాయికి తలపడ్డాయి. వివాదం ముదురుతుండడంతో అక్కడే ఉన్న కొందరు టెక్కలి పోలీసులకు సమాచారం అందజేయడంతో ఎస్‌ఐ రమేష్‌ సిబ్బందితో చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా క్రీడాకారులు పోలీసులు మాట వినకపోవడంతో ఇరువర్గాలని చెదరగొట్టారు. వివాదంపై టెక్కలి డిఎస్‌పి బాలచంద్ర రెడ్డి, సిఐ సూర్యచంద్రమౌళి ద్వారా ఆరా తీశారు. ఇరువర్గాలను చర్చలకు పిలిచే నేపథ్యంలో కొందరు వైసిపి నాయకులు జోక్యం చేసుకొని తమ పరిధిలోనే సమస్య పరిష్కరించుకుం టామని చెప్పడం గమనార్హం. క్రీడాకారులు కొట్లాటకి దిగడం పోలీసులు చదరగొట్టడంతో మైదానంలో మిగిలిన క్రీడాకారులు ఆందోళనకు గురయ్యారు. గురువారం నిర్వ హించనున్న పోటీల్లో పోలీస్‌ బందోబస్తు లేకుండా పోటీలు నిర్వహించలేమని నిర్వాహక సిబ్బంది తెలియజేశారు.

 

➡️