చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా

చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా పెంచాలని జిల్లా ఎన్నిక

సమీక్షిస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా పెంచాలని జిల్లా ఎన్నిక అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అమ్మకాలు, ఎక్కడైనా ఎక్కువ మోతాదులో నిల్వ చేసిన అక్రమ మద్యంపైన, అక్రమ మద్యం రవాణా గురించి, ఎక్సైజ్‌, సెబ్‌ కలిసి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎచ్చెర్లలోని ఎపిఎస్బిసిఎల్‌ డిపో నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లకు మద్యం ఏ విధంగా సరఫరా చేయు వాహనాల జిపియస్‌, రూట్‌ మ్యాప్‌, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. షాపులు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. షాపుల్లో రోజు వారీ రిజిష్టర్లు మెంటైన్‌ చేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచిఏ వచ్చే మద్యంపైన దృష్టి సారించాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించారు. మీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి వారి వారి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్షించాలన్నారు. ఒక వ్యక్తి మూడు బాటిళ్లు మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారావు కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు పక్కనే ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో 14 షాపులను గుర్తించినట్లు చెప్పారు. రణస్థలం మండలం బంటుపల్లి వద్ద ఉన్న యునైటెడ్‌ బ్రెవరేజస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో తయారు అవుతున్న బీరుపై ఆరా తీశామన్నారు. కంపెనీ నిర్వహణపై బ్రెవరేజస్‌ యాజమాన్యంపై డిస్టిలరీ ఆఫీసర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో బీర్లు తయారీ తగ్గించాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూమ్‌లో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా బీర్ల ఫ్యాక్టరీ, ఎపిఎస్బిసిఎల్‌ హోల్‌సేల్స్‌ను 24ఇంటు7 పరిశీలించాలన్నారు. ఒరిస్సా బోర్డర్‌లో ఏవిధంగా చూస్తున్నది అదనపు ఎస్‌పి గంగాధరంను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సెబ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు, యునైటెడ్‌ బ్రెవరి లిమిటెడ్‌ డిస్టిలరీ ఆఫీసర్‌ ఎం.ఆర్‌.కె.దాస్‌, బ్రెవరీ యాజమాన్యం పాల్గొన్నారు.

 

➡️