టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ

శ్రీకాకుళం నియోజకర్గానికి తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే

కంటతడి పెట్టుకున్న లక్ష్మీదేవి

స్పష్టం చేసిన చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

కంటతడి పెట్టుకున్న వైనం

ఎంపీ ఇంటి వద్ద కార్యకర్తల బైఠాయింపు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

శ్రీకాకుళం నియోజకర్గానికి తనకు టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని, మాజీ ఎమ్మెల్యే, టిడిపి గుండ లక్ష్మీదేవి స్పష్టం చేశారు. అరసవల్లిలోని గుండ స్వగృహంలో శుక్రవారం సమావేశమైన కార్యకర్తలు ఉద్వేగానికి గురయ్యారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కంటతడి పెట్టారు. ఏళ్ల తరబడి కొంతమంది రాజకీయ కుట్రలకు తమ కుటుంబం బలైపోతోందని మాజీ మంత్రి గుండ అప్పలసూర్య నారాయణ, లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం కేంద్రంలో శరవేగంగా జరుగుతున్న పరిణామాల్లో గుండ వర్గీయులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఏళ్ల తరబడి నిజాయితీగా రాజకీయం చేస్తూ ప్రజలకు సేవచేస్తున్న తమ కుటుంబంపై సొంత పార్టీలోనే కొందరు వెన్నుపోట్లు పొడుస్తున్నారని అన్నారు. ఇన్నాళ్లపాటు పార్టీ కోసం అన్ని భరించామని, ఇక భరించే శక్తి తమకి లేదని గుండ దంపతులు బోరున విలపించారు. 24 గంటల్లో పార్టీ అధిష్టానం శ్రీకాకుళం నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా తమను ప్రకటించకపోతే ఇండిపెండెంట్‌గా శ్రీకాకుళం అసెంబ్లీకి పార్లమెంటు బరిలో దిగుతామని గుండ దంపతులు ప్రకటించారు. గుండ దంపతులిద్దరూ బోరున విలపించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర వేదనకు గురయ్యారు. దీంతో వారి అభిమానుల్లో ఆవేశం కట్టలు తెగినంత పనైంది. సమావేశంలో పాల్గొన్న గుండ దంపతులకు అండగా నిలుస్తూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నగరంలోని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఇంటికి చేరుకుని బైఠాయించారు. కనీసం ఒక్క శాతమూ ఓటు బ్యాంకు లేని బిజెపికి శ్రీకాకుళం స్థానం నుంచి టిక్కెట్టు ఎలా ఇస్తారని నిలదీశారు. పార్టీ ప్రయోజనం కోసం గడచిన ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను ఓర్చామని, ఇటువంటి సమయంలో టిక్కెట్లు ఇవ్వకుండా బిజెపి కేటాయిస్తామని చెప్పడం సరికాదని అన్నారు. ప్రత్యర్థికి ధీటుగా బలమైన అభ్యర్థిని కాదని, వేరొకరికి టిక్కెట్టు ఇస్తే నష్టపోతామని నిలదీశారు. కార్యకర్తల ఆవేదనను పార్టీ అర్ధం చేసుకుంటుందని, గుండ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేయబోరని ఎంపీ వారికి నచ్చజెప్పారు. అనంతరం ఆయన బయలుదేరి విజయవాడ వెళ్లిపోయారు.

 

➡️