ట్రాఫిక్‌ నిబంధనలతో ప్రమాదాల నివారణ

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో న్యాయ అవగాహనా సదస్సును మంగళవారం నిర్వహించారు. జనన ధ్రువపత్రాలతో పాటు వివాహాల రిజిస్ట్రేషన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ తదితర చట్టాలపై ఎంపిఆర్‌ లా కళాశాల, అంబేద్కర్‌ యూనివర్సిటీలోని లా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలపై మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వి గంగాధరరావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ట్రాఫిక్‌ నియమాలను విద్యార్థులకు వివరించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ రవికుమార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వివరించారు మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.వెంకటరావు, జిల్లా పంచాయతీ అధికారి పి.వెంకటేశ్వరరావు జనన, మరణ ధ్రువపత్రాల జారీపై అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిఆర్‌ లా కళాశాల ప్రిన్సిపల్‌ కె.మోషే, బిఆర్‌ఎయు లా కాలేజ్‌ ఫ్యాకల్టీ టంకాల బాలకృష్ణ, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️