తెలగలను బిసిలో చేర్చాలి

తెలగను బిసి జాబితా చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షులు పల్లంట్ల వెంకటరామారావు (పివిఆర్‌) డిమాండ్‌

మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి- పలాస

తెలగను బిసి జాబితా చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షులు పల్లంట్ల వెంకటరామారావు (పివిఆర్‌) డిమాండ్‌ చేశారు. తెలగలను బిసిలో చేర్చాలనే డిమాండ్‌ చేస్తూ… ఇచ్ఛాపురం నుంచి పాయకరావుపేట వరకు ఆయన చేపట్టిన పాధయాత్ర గురువారం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో కొనసాగింది. టికెఆర్‌ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు పలాసకు చెందిన రాజరాజేశ్వరి తెలగ సంఘం మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. పలువురు సంఘీభావంబిసి రిజర్వేషన్‌ పివిఆర్‌ చేపట్టి పాదయాత్రకు వైసిపి, టిడిపికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ముందుగా పలాస కాశీబుగ్గ మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు రైల్వేస్టేషన్‌ వద్ద పివిఆర్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. పలాస ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గౌతు శిరీష, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ పివిఆర్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తెలగ సంఘ అధ్యక్షులు శీలం రూపుందర్‌, కౌన్సిలర్‌ బల్ల రేవతి, శ్రీనివాస్‌, ప్రతాప్‌, పుట్టా లోకనాథం, రాజు, భాస్కరరావు, వేణు. గోవింద్‌ పాల్గొన్నారు. లావేరు : ఉత్తరాంధ్రలో ఉన్న తెలగలను బిసి జాబితాలో కలపాలని చేపట్టిన పల్లంట్ల వెంకట రామారావు ఇచ్చాపురం నుంచి ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఐదోరోజుకు చేరుకోవడంతో లావేరు, రణస్థలం మండలాలకు చెందిన తెలగ సంఘ నాయకులు పలాస కాశీబుగ్గలో పివిఆర్‌ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో చిక్కాల కృష్ణారావు, రాయపురెడ్డి శ్రీను, కోలా సూరిబాబు, రాజేష్‌, పెద్ది శ్రీను, ఆర్‌.శ్రీను తదితరులు ఉన్నారు.

 

➡️