నల్లబ్యాడ్జీలతో ఉపాధి సిబ్బంది నిరసన

సుదీర్ఘకాలంగా ఉపాధి హామీ

శ్రీకాకుళం అర్బన్‌ : నిరసన తెలుపుతున్న ఉపాధి ఉద్యోగులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

సుదీర్ఘకాలంగా ఉపాధి హామీ విధులు నిర్వహిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులు తమకు వేతనాలు పెంచాలని, గ్రేడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని, పిఆర్‌సి వర్తింపజేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్లతో నిరసన చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయాన నిరసన తెలిపారు. జెఎసి చైర్మన్‌ వై.వి.రమణ ఉపాధి హామీలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్నామన్నారు. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రత్నాకర్‌, సుజాత, బి.వి.రమణమూర్తి, అరుణ, ఎస్‌.సుబ్రహ్మణ్యం, ఎన్‌.రామకృష్ణ పాల్గొన్నారు. పొందూరు: ఉపాధి హామీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్ర జెఎసి పిలుపుమేరకు సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇందులో పనిచేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. ఈ పథకంలో పనిచేస్తున్న వారిలో కేవలం ఎపిఒలకు మాత్రమే గ్రేడ్‌ ఫిక్స్‌న్‌ చేశారని, మిగిలిన ఇసి, టిఎలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఎటువంటి జీతాలు పెంపుదల చేయలేదని వాపోయారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు టి.నటరాజ్‌, పి.పాపారావు, ఎన్‌.ఈశ్వరరావు, జగన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు గోవిందరాజు, బి.చంద్రశేఖర్‌, ఎన్‌.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. లావేరు : మండలంలోని ఉపాధి కార్యాలయంలోని ఉద్యోగులు నల్ల బాడ్జీలు ధరించి విధులకు హారై తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైమావతి, పి.రమణ పాల్గొన్నారు.

➡️