పట్టణ పేదలకు ‘ఉపాధి’ కల్పించాలి

పట్టణ ప్రాంతాల్లో నివాసం

కూలీలతో మాట్లాడుతున్న సింహాచలం

ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్‌

పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని, దీనికి ఉపాధి చట్టం తీసుకురావాలని వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. మండలంలోని సిలగాం సింగువలస, బెండివా నిపేట గ్రామాల్లో మంగళవారం కూలీలతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని దశల వారీగా నిధులు తగ్గిస్తూ… ప్రస్తుతం రూ.66 వేల కోట్లకు పరిమితం చేశారని అన్నారు. అంతే 30 శాతం కోత పెట్టారని వివరించారు. గతంలో తాగునీటి సౌకర్యం కల్పించేవారని అన్నారు. గునపాలకు, పారలకు పదును పెట్టడానికి డబ్బులు చెల్లించేవారని గుర్తు చేశారు. నీడ కోసం టెంట్లు వేసేవారని, మెడికల్‌ కిట్లు ఇచ్చే వారని, అవన్నీ అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఉపాధి హామీకి బడ్జెట్‌లో నిధులు కోత విధించడం తగదన్నారు. శ్రీకాకుళం నగరం చుట్టూ ఉన్న ఏడు విలీన పంచాయతీల్లో ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

➡️