పాలనలో విప్లవాత్మక మార్పులు

వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాలనలో

సంక్షేమ పథకాల లబ్ధిని వివరిస్తున్న స్పీకర్‌ సీతారాం

  • శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ప్రజాశక్తి – ఆమదాలవలస

వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని తోటాడలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైసిపి ప్రభుత్వ హయాంలో చేకూరిన లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సేదం… ఈ మూడు రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను శతశాతం పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ప్రజలకు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సర్పంచ్‌ మెట్ట శారద, ఎంపిటిసి తాండ్ర లక్ష్మి, మాజీ ఎంపిటిసి గురుగుబెల్లి ప్రభాకరరావు, ఎంపిడిఒ ఎస్‌.వాసుదేవరావు, మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, విద్యుత్‌శాఖ ఎఇ రవికుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ జెఇ చంద్రమౌళి, ఎపిఎం పైడి కూర్మారావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

 

➡️