పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌ ఉపాధ్యాయులు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద

రసన తెలుపుతున్న యుటిఎఫ్‌ నాయకులు

  • మున్సిపల్‌ ఉపాధ్యాయుల ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

దీర్ఘకాలిక పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌ ఉపాధ్యాయులు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌, బదిలీలు, ప్రమోషన్లు, అప్‌గ్రేడేషన్‌, పిఎఫ్‌ అకౌంట్ల కేటాయింపు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లును కొత్త డిడిఒల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలన్నారు. భవనాల అద్దె, కరెంట్‌ బిల్లులు, అన్నిరకాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 15న కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.సూర్యప్రకాశరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ ఎస్‌.కిషోర్‌ కుమార్‌, నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.వైకుంఠరావు, టి.సీతారాం, బి.వెంకటరావు, కె.అప్పన్నదాసు, ఎ.చిన్నవాడు, డి.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.ని

 

➡️