ప్లైఓవర్‌ వద్దు… బైపాస్‌ ముద్దు

రణస్థలం మండల కేంద్రంలో ఫ్లైఓవర్‌ వద్దని వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ

మాట్లాడుతున్న సర్పంచ్‌, గ్రామ పెద్దలు

ప్రజాశక్తి- రణస్థలం

రణస్థలం మండల కేంద్రంలో ఫ్లైఓవర్‌ వద్దని వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు. ఆదివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌, గ్రామ పెద్దలు భవిరి రమణ, దెయ్యం శ్రీనివాస్‌, ఇడదాసుల తిరుపతిరాజు, అల్లు యుగంధర్‌ మాట్లాడుతూ జెఆర్‌పురం గ్రామ పంచాయతీలో కొన్ని తరాలుగా నివాసముంటున్నామని, ఊరు మధ్యనుంచి 16వ నెంబర్‌ జాతీయ రహదారి ఉందని, 20 ఏళ్ల క్రితం జాతీయ రహదారి నాలుగు లైన్లు విస్తరణ కోసం మా భూములను కొంతమేర కోల్పోయామని, మిగిలిన స్థలాల్లో శాశ్విత భవనాలు నిర్మించుకుని ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. అయితే ఇటీవల జాతీయ రహదారుల సంస్థ, రెవెన్యూశాఖ సర్వే సిబ్బంది వచ్చి కొలతలు వేస్తున్నారని, రెండవసారి జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఫ్లైఓవర్‌ నిర్మాణం కోసం ఈ సర్వే చేస్తున్నట్టు తెలియజేస్తున్నారని, దీంతో జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిసారి విస్తరణలో ఆస్థులు కోల్పోయి, జీవనోపాధి కోల్పోయి వలసలు పోయారని, ఇప్పుడు ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడితే జీవనోపాధికి తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు. వెంటనే ఫ్లైఓవర్‌ ని ర్మాణ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫ్లైఓవర్‌ వద్దు బైపాస్‌ ముద్దని నినాదాలు చేశారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపడితే ఆందోళ నలు, రాస్తారోకోలు, నిరహారదీక్షలు, కార్యాలయాల ముట్టడి చేపడతామని హెచ్చరించారు.

➡️