రూ.20 కోట్లతో అంగన్వాడీ భవనాల ఆధునికీకరణ

జిల్లాలో 1065 అంగన్వాడీ భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో

సమావేశంలో మాట్లాడుతున్న శాంతిశ్రీ

  • ఐసిడిఎస్‌ పీడీ శాంతిశ్రీ

ప్రజాశక్తి – పలాస

జిల్లాలో 1065 అంగన్వాడీ భవనాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లతో అంగన్వాడీ భవనాల ఆధునికీకరణలో భాగంగా నాడు-నేడు కార్యక్రమంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్వాడీ పరిధిలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి త్వరలో భవనాల ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.రెండు లక్షల వరకు బిల్లు చేసే అధికారం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారికి ఉందన్నారు. అంతకుమించి నిధులు మంజూరు చేయాలంటే కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి సూపర్‌వైజర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి, అంగన్వాడీ కేంద్రాల వివరాలను జిల్లా కేంద్రానికి అందజేయాలన్నారు. సమావేశంలో సమగ్ర శిక్ష ఎపిసి రోణంకి జయప్రకాష్‌, ఐసిడిఎస్‌ నోడల్‌ అధికారి పి.మణెమ్మ, నాడు-నేడు డిఇ శ్రీనివాసరావు, ఎఇలు ఆర్‌.రాజేంద్రరెడ్డి, సునీల్‌ కుమార్‌, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

 

➡️