రేపు జాబ్‌మేళా

ప్రభుత్వ ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యాన నగరంలో డిఎల్‌టిసి, ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి

శ్రీకాకుళం అర్బన్‌ :

ప్రభుత్వ ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యాన నగరంలో డిఎల్‌టిసి, ప్రభుత్వ ఐటిఐ ఆవరణలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఉపాధి శాఖాధికారి కొత్తలంక సుధ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జాబ్‌ మేళాకు క్యాలిబర్‌, ఫ్యూషన్‌ మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులు పాల్గొని అర్హులైన అభ్యర్థుల ఉద్యోగ నియామకాలు చేపడతారని తెలిపారు. క్యాలిబర్‌ కంపెనీలో 80 ఖాళీలున్న ఎగ్జిక్యూటివ్‌, టెలికాలర్‌ పోస్టులకు నెలకు రూ.15వేలు నుంచి రూ.25వేల వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంటర్‌ ఆపైన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల స్త్రీ,పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ప్యూషన్‌ మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో 70 ఖాళీలు ఉన్నాయని, రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు వేతనం చెల్లిస్తారని తెలిపారు. ఇంటర్‌, డిగ్రీ ఆపైన విద్యార్హత కలిగిన 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు తీసుకొని జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హత వివరాలను షషష.చీజూ.+ఉV.×చీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

➡️