రైతులకు అండ

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధికారంలోకి రైతులకు అండగా నిలుస్తుందని అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ

లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న నాయకులు

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధికారంలోకి రైతులకు అండగా నిలుస్తుందని అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ భవనంలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే రూ.ఆరు వేలు, రాష్ట్రం తరుపున రూ. పది వేలు వంతున రైతులకు ఏడాదికి రూ.16 వేలు చేయూత అందిస్తామన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. వ్యవసాయ కూలీ పెట్టుబడి ఖర్చుకూ సాయం అందిస్తామన్నారు. రైతుకు సమా జం తప్ప సామాజిక తరగతి ఉండదని అన్నారు. రైతు పండించిన పంటలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. అప్పుడే మద్దతు ధర సాధ్యమవుతుందని అన్నారు. తమ పార్టీ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యే కార్యాచరణను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సంపద సృష్టి కేంద్రాలుగా రూపొందిస్తామన్నారు. ఏటా రూ. 500 కోట్లతో ప్రతి నియోజకవర్గాన్నీ అభివృద్ధి చేస్తామని అన్నారు. మద్యం అమ్మకాలను నిరోధించడం కంటే ముందు అవినీతి లేని పాలన అందించాలన్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవు తుందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌, ప్రజల అభ్యున్నతి ప్రధాన అజెండాగా తాము పనిచేస్తామ న్నారు. ఈ సారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ, శాసనసభల్లో దేనికి పోటీ చేయాలన్నది పార్టీ సమిష్టి నిర్ణయంతో ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జాతీయస్థాయి నిర్ణయం మేరకు తెలంగాణ, మహారాష్ట్రల్లో పోటీ చేస్తామన్నారు. అధికారంలోకి వస్తే అప్పులు లేని ఆంధ్ర రాష్ట్రం నిర్వహణకు ప్రాధాన్యత నిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ ఇంజరాపు జయదేవ్‌, అధికార ప్రతినిధి చౌదరి లక్ష్మణ్‌, శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు రాగోలు నాగశివ, పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాలకృష్ణ పట్నాయక్‌ పాల్గొన్నారు.

 

➡️