రోటరీ సేవలు అమోఘం

స్థానిక రోటరీక్లబ్‌ అధ్వర్యంలో ఆదివారం రోటరీ గవర్నర్‌ డి.సుబ్బారావు విజిట్‌ సందర్భంగా వికలాంగులకు చేయూతనిస్తు కుత్రిమ చేతులు పంపిణీ చేశారు. దాదాపు రూ.25వేలు విలువ గల కుత్రిమ చేతులు ఏడుగురు అభ్యర్థులకు తొడిగారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు రోహిత్‌ అధ్యక్షత వహించారు. బరంపురం రోటరీ క్లబ్‌ సహకారంతో సంయుక్తంగా కుత్రిమ చేతులు అందించడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్‌ ద్వార

సోంపేట : బెంచీలను ప్రారంభిస్తున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

స్థానిక రోటరీక్లబ్‌ అధ్వర్యంలో ఆదివారం రోటరీ గవర్నర్‌ డి.సుబ్బారావు విజిట్‌ సందర్భంగా వికలాంగులకు చేయూతనిస్తు కుత్రిమ చేతులు పంపిణీ చేశారు. దాదాపు రూ.25వేలు విలువ గల కుత్రిమ చేతులు ఏడుగురు అభ్యర్థులకు తొడిగారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు రోహిత్‌ అధ్యక్షత వహించారు. బరంపురం రోటరీ క్లబ్‌ సహకారంతో సంయుక్తంగా కుత్రిమ చేతులు అందించడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్‌ ద్వార అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ కోసం అందించిన కాటన్‌ బ్యాగ్‌లు అవిష్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పి.రాజకుమార్‌, పి.దినేష్‌ కుమార్‌, రామ కోటి, పాక దాసు, ఆమీర్‌ ఆలీ, నవీన్‌ చౌదరి, కృష్ణమూర్తి రెడ్డి, త్రినాథ్‌ రెడ్డి, రామారావు పాల్గొన్నారు.సోంపేట: రోటరీక్లబ్‌ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు తనతండ్రి చిన్నారావు జ్ఞాపకార్థం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రయాణి కుల సౌకర్యంకోసం తాగునీరు, కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేసి బాసటగా నిలిచారు. ఆదివారం కాంప్లెక్స్‌ ఆవరణ లో ఏర్పాటు చేసిన తాగునీరు, బెంచీలను ప్రారంభించారు. ప్రయాణికులకు బాసటగా నిలవడంతో స్థానికులు, ప్రయాణికులు రోటరీ సేవలపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో శ్రీశయనవీధిలో ప్రభుత్వ పాఠశాలలో రోటరీక్లబ్‌ ప్రతినిధి కమల ట్రేడర్స్‌ అధినేత మల్లా తిరుమలరావు రూ.లక్షతో ప్రభుత్వ పార Äశాలకు (సిబిఎం స్కూల్‌) మూడు ఇనుము గ్రిల్స్‌ ఏర్పాటు చేయడంతో వీధి వాసులు రోటరీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాకమిటీ, ఉపాధ్యాయులు కలిసి రోటరీక్లబ్‌ ప్రతినిధులకు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రోటరీ జిల్లా గవర్నర్‌ రావూరి సుబ్బారావు (దత్త), రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు, కృష్ణారావు, రమణ, రవికుమార్‌, వి.శివశంకర్‌, సభ్యులు పాల్గొన్నారు.

 

➡️