లక్ష్యం చేరుకునేనా..?

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల

బూర్జ మండలం పనుకుపర్త, కిల్లంతరి గ్రామాల మధ్య పొలాల్లో ధాన్యం కుప్పలు

ఇప్పటివరకు 4.13 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు

అపరాల సాగుతో పలు మండలాల్లో జరగని నూర్పులు

రైతుల వద్ద మరో లక్ష టన్నులు ఉంటుందని అంచనా

జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరింది. ధాన్యం సేకరణలో తొలుత సాంకేతిక సమస్యలు, ధాన్యం నాణ్యంగా లేవని మిల్లరు నిరాకరించడం వంటి సమస్యలు ఎదురైనా క్రమేణా కొనుగోలు పుంజుకున్నాయి. 2023 ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడిలో సుమారు 80 శాతం కొనుగోలు చేసినట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతుల వద్ద మరో లక్ష ఎకరాల వరకు ధాన్యం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అపరాల సాగుతో నూర్పులకు వీల్లేక వరికుప్పలు పొలాల్లోనే ఉన్నాయి. నూర్పులు తర్వాత కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఖరీఫ్‌ సీజన్‌లో 3,51,843 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో 3,50,765 ఎకరాలకు పంటల క్రాపింగ్‌ జరిగింది. 3,34,330 ఎకరాలకు ఇకెవైసి పూర్తయింది. ఈ ఏడాది 8.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 7,87,447 మెట్రిక్‌ టన్నులు మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం 5.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరి సాధారణ రకం క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,203 మద్దతు ధర ప్రకటించింది. ధాన్యం కొనుగోలుకు అధికారులు జిల్లావ్యాప్తంగా 606 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. రెండు వేలు పైబడి ధాన్యం సేకరించే అవకాశమున్న కేంద్రాలను ఎ-కేటగిరీగా, వెయ్యి నుంచి రెండు వేల టన్నుల్లోపు వరకు కొనుగోలు చేసే వాటిని బి-కేటగిరీగా విభజించారు. వెయ్యి టన్నుల కంటే తక్కువ ధాన్యం కొనుగోలుకు అవకాశం ఉన్న వాటిని సి-కేటగిరీగా నిర్ణయించారు.మందగించిన కొనుగోలుజిల్లాలో పండగ సీజన్‌ ముందు వరకు ధాన్యం కొనుగోలు చాలా జోరుగా సాగాయి. ఆ తర్వాత మందగించాయి. ఆమదాలవలస, నరసన్నపేట, పొందూరు, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం తదితర మండలాల్లో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా జరగలేదు. పెసర, మినుము తదితర పంటలను సాగు చేస్తుండడంతో అక్కడ నూర్పులు జరగలేదు. అపరాల తర్వాత అక్కడ ధాన్యం వచ్చే అవకాశముంది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను తెరిచే ఉంచారు. జలుమూరు, సారవకోట, పోలాకి, బూర్జ, తదితర ప్రాంతాల్లో పంట వేగంగా చేతికి రావడంతో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కావడంతో కేంద్రాలను మూసివేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ఇచ్ఛాఫురం, సోంపేట, కంచిలి, కవిటి మండలాల్లో ఈసారి పంట పెద్దగా లేకపోవడంతో అక్కడా కొనుగోలు పూర్తయ్యాయి.మండలాల్లో కొనుగోలు పరిస్థితి ఇలా…జిల్లాలో గ్రేడ్‌-ఎ, సాధారణ రకం ధాన్యం కలిపి మొత్తం 4.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కంచిలిలో అత్యల్పంగా కేవలం 89.56 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. కవిటిలో 728.52 మెట్రిక్‌ టన్నులు, ఇచ్ఛాపురంలో 3,404.84 మెట్రిక్‌ టన్నులు, పొందూరులో 3,367.24 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. లావేరులో 4,505.72 మెట్రిక్‌ టన్నులు, ఎచ్చెర్లలో 3,142.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. జిల్లాలో అత్యధికంగా జలుమూరులో 31,861.44 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత స్థానంలో సారవకోట ఉంది. సారవకోటలో 24,532.76 మెట్రిక్‌ టన్నులు కొన్నారు. నరసన్నపేటలో 26,336.60 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేశారు. నందిగాంలో 21,515.32 మెట్రిక్‌ టన్నులు, మెళియాపుట్టిలో 21,175 మెట్రిక్‌ టన్నులు, కొత్తూరులో 20,439.92 మెట్రిక్‌ టన్నులు, కోటబొమ్మాళిలో 21,731.72 మెట్రిక్‌ టన్నులు సేకరించారు.రూ.111 కోట్ల బకాయిలుజిల్లాలో 96,068 మంది రైతుల నుంచి 914.15 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. మిల్లర్లకు రూ.883.35 కోట్ల విలువైన ధాన్యం చేరింది. ఇప్పటివరకు రైతులకు రూ.772.03 కోట్లు చెల్లించారు. మరో రూ.111.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. గన్నీ బ్యాగుల కోసం 1.88 కోట్లు, లేబర్‌ ఛార్జీల కింద రూ.5.95 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం రవాణా ఛార్జీల కింద రూ.8.71 కోట్లు చెల్లించాల్సి ఉంది.

 

➡️