లింగ నిర్ధారణ పరీక్షలు నేరం

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై గురువారం నిర్వహించిన న్యాయ

మాట్లాడుతున్న సన్యాసినాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్‌లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై గురువారం నిర్వహించిన న్యాయ అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కానింగ్‌ సెంటర్లు ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పీడీ బి.శాంతి శ్రీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి కె.వి రమణ, న్యాయవాది జి.ఇందిరాప్రసాద్‌, సిడిపిఒ శోభ, అంగన్వాడీ, మెప్మా కార్యకర్తలు పాల్గొన్నారు.పిల్లలను పనిలో పెట్టవద్దుచిన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు అన్నారు. కార్మికశాఖ, బాలల సంరక్షణ, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, బ్రెడ్స్‌ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా నగరంలోని జిటి రోడ్డులోని షాపుల్లో బాల కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌ను గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ సర్కిల్‌ వన్‌ శైలేష్‌ కుమార్‌, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఎస్‌ఐ కేశవరావు, రెండో పట్టణ ఎఎస్‌ఐ శంకరరావు, చైల్డ్‌లైన్‌ సూపర్‌వైజర్‌ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

 

➡️