లోక్‌ అదాలత్‌తో సత్వర పరిష్కారం

లోక్‌ అదాలత్‌తో కేసుల

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

  • జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

ప్రజాశక్తి – శ్రీకాకుళం

లోక్‌ అదాలత్‌తో కేసుల సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు. జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసేందుకు ప్రతిరోజూ శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు జ్ఞాన సువర్ణరాజు ఆధ్వర్యాన ప్రీ లోక్‌ అదాలత్‌ సెట్టింగ్స్‌ నిర్వహిస్తారని తెలిపారు. రాజీపడిన దగిన క్రిమినల్‌, మోటారు ప్రమాద కేసులు, అన్నిరకాల సివిల్‌ కేసులోని కక్షిదారులు ప్రీ లోక్‌ అదాలత్‌ సిట్టింగ్‌ ఉపయోగించుకుని రాజీ చేసుకోవాలని కోరారు. ఇరుపక్షాల వారిని సమన్వయపరిచి రాజీకి సంసిద్ధులను చేస్తారని చెప్పారు. ప్రీ లోక్‌ అదాలత్‌ సెట్టింగ్స్‌ ప్రతిరోజూ జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో ఉన్న శాశ్వత లోక్‌ అదాలత్‌ కార్యాలయంలో జరుగునని తెలిపారు. సమావేశంలో శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు జ్ఞాన సువర్ణరాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

➡️