వైసిపి విస్తృత ప్రచారం

సంక్షేమం, అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస : పోస్టర్లు పంపిణీ చేస్తున్న స్పీకర్‌ సీతారాం

ప్రజాశక్తి- ఆమదాలవలస

సంక్షేమం, అభివృద్ధి వైసిపితోనే సాధ్యమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం మండలంలోని మునగవలస, ధన్నానపేట, సంత కొత్తవలస గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మాట్లాడుతూ వైసిపి పాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని అందుకే మరోసారి వైసిపికి ఓటువేసి మరోసారి జగన్మోహన్‌ రెడ్డిని బలపర్చాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కో-ఆర్డినేటర్‌ నిరంజన్‌ బాబు, సర్పంచ్‌ ప్రతినిధి రాయి చిన్నారావు, దన్నాన సత్యం, ధన్నాన రవి, యర్రంనాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మెళియాపుట్టి : ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు రెడ్డి శ్రావణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వసుందర, కోసమాల గ్రామాల్లో గుడ్‌ మార్నింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి బి.ఉదరుకుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లన బాలరాజు, వైసిపి మండల కన్వీనర్‌ పల్లి యోగి, జయముని, సలాన చిట్టి పాల్గొన్నారు. పలాస : మండలంలోని బ్రాహ్మణతర్ల, పండాశాసనం గ్రామాల్లో పిఎసిఎస్‌ అధ్యక్షులు పైల వెంకటరావుచిట్టి, ఎంపిపి ప్రతినిధి ఉంగ సాయికృష్ణ, గొండు మోహనరావు, దంతం వైకుంఠరావు. బాడాన పుష్ప, తుంగాన రవణమ్మ. కర్ర గంగాధర్‌రావు, పొట్టూరు తారక రామారావు, గరికి ధర్మారం, జామి సంతు, కోరాడ నాగరాజు, బాడన నాగరాజు, వడ్డీ హేమలత వైసిపి తరుపున ప్రచారం చేశారు. అప్పలరాజును ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ చతీష్‌ఘడ్‌ రాష్ట్రం బిలారులో వైసిపి నాయకులు వజ్రపుకొత్తూరు మండలం కంబాల రాయుడుపేట సర్పంచ్‌ వంక చిరంజీవి, దౌలపల్లి శ్రీనివాసరావు, రుద్రమూర్తి, వంక వెంకటరావు, తిరుపతిరావు, గిరిబాబు ప్రచారం చేశారు. ఇచ్ఛాపురం : పట్టణంలోని 4,5 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, టౌన్‌ పార్టీ అధ్యక్షులు బలివాడ ప్రకాష్‌ పట్నాయక్‌, సాలిన ఢిల్లీరావు, గేదెల సోమయ్య, కిరమని బెహార, ప్రత్తి అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️