‘శంఖారావం’ను విజయవంతం చేయాలి

జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

లావేరు : శంఖారావం సభ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- నరసన్నపేట

జగన్‌ మోహన్‌ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పూరించిన నాధమే శంఖారావమని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ పరిశీలకులు మహంతి చిన్నం నాయుడు అన్నారు. శనివారం టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో లోకేష్‌ పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో పర్యటించి జగన్‌ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు. శంఖారావంతో కార్యకర్తలు లోకేష్‌ వైపు మరింత చేరువయ్యేలా చేస్తుందన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.లావేరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఎచ్చెర్ల మాజీ ఎఎంసి చైర్మన్‌ యినపకుర్తి తోటయ్యదొర పిలుపునిచ్చారు. 15న లావేరులో నిర్వహించనున్న సభా ప్రాంగణాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు ఆధ్వర్యంలో జరుగుతుందని, అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభా పోస్టర్‌ను ఆవిష్కరించారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పిన్నింటి మధుబాబు, లంకలపల్లి జగన్‌, ఎల్‌. శ్రీను, గొర్లె శ్రీనువాసరావు, లంకలపల్లి బాబు, మహేష్‌, ఎల్‌.ఆనంద్‌, ఐ.రమణ, వెంకటరమణ ఉన్నారు.

 

➡️