సంక్రాంతి శోభ

తెలుగువారి పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ కోసం కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున మామార్కెట్‌

కిటకిటలాడుతున్న జిటి రోడ్డు

శ్రీకాకుళం అర్బన్‌ :

తెలుగువారి పెద్ద పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ కోసం కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు జనం పెద్ద ఎత్తున మామార్కెట్‌ వెళ్లడంతో కిటకిటలాడుతున్నా యి. జిల్లా వ్యాప్తంగా అటు వస్త్ర వ్యాపారులు, ఇటు ఫుట్‌పాత్‌ వద్ద కొనుగోలుతో జన సందడి కొద్ది రోజులుగా ఉంది. శనివారం చెరకు, రేగుపళ్లు, కంద, కలగాయకూరలు, పళ్లు, పూలు, మిఠాయిల తో పాటు పిండి వంటకాలనూ కొనుగోలు చేసుకున్నవారి సంఖ్య పెరిగింది. పూర్వం ఇంటిలోనే పిండివంటకాలు చేసుకొనే పరిస్థితి ఉంది. మారిన జీవనశైలితో పాటు మిఠాయిలు, పిండి వంటకాలూ బయట దుకాణాల్లో ఎప్పటికప్పుడు చేసి అమ్మకానికి ఉంచారు. నగరంలోని రైతు బజారు, ఇటు పొట్టి శ్రీరాములు మార్కెట్‌ కిటకిటలాడాయి. టెక్కలి రూరల్‌: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో శనివారం సందడి వాతావరణం చోటుచేసుకుంది. మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు టెక్కలి చేరుకోవడంతో టెక్కలిలోని ప్రధాన మార్గాలు రద్దీగా మారాయి. ఆర్‌టిసి కాంప్లెక్స్‌, ఇందిరాగాంధీ, అంబేద్కర్‌ కూడళ్ల వద్ద జననసమ్మర్థం అధికమైంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వివిధ రకాల సామగ్రి డిమాండ్‌ ఏర్పడింది. కూరగాయాల దగ్గర నుంచి వస్త్రదుకాణాలు వరకు కొనుగోలుదారులతో రద్దీ పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. ఇందిరాగాంధీ, అంబేద్కర్‌ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు చర్యలు ట్రాఫిక్‌ రద్దీను నియంత్రించలేకపోయారు. దీంతో ద్విచక్ర వాహనాలు, బస్సులు రాకపోకల మధ్య ప్రజలు రాకపోకలకు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

➡️