సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

Nov 23,2023 21:50
సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని జాడుపల్లిలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందని

టెక్కలి రూరల్‌ : జెండాను ఆవిష్కరిస్తున్న కృపారాణి

ప్రజాశక్తి- మెళియాపుట్టి

సంక్షేమం, అభివృద్ధి సిఎం జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని జాడుపల్లిలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్లలో విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు భరోసా వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి సంక్షేమ పథకాల బోర్దును ప్రదర్శించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, ఎంపిపి ప్రతినిధి బైపోతు ఉదరు కుమార్‌, జెడ్‌పిటిసి గూడ ఎండయ్య, పిఎసిఎస్‌ అధ్యక్షులు ఉర్లాన బాలరాజు, మండల పార్టీ కన్వీనర్‌ పల్లి యోగి, కరణం శశిభూషణరావు, ప్రసాదరావు, జయముని పాల్గొన్నారు. సోంపేట: పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం అందిస్తుందని ఎంపిపి డాక్టర్‌ నిమ్మన దాసు అన్నారు. సోంపేట మండలంలోని ఇస్కలపాలెం సచివాలయం పరిధిలో గురువారం జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుకలపాలెం సచివాలయం పరిధిలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.25 కోట్లు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు శిలగాన భాస్కరరావు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ బైపల్లి రామారావు, ధర్మారావు, కామయ్య, దశరాజు, ఇఒపిఆర్‌డి వెంకట్రావు పాల్గొన్నారు. టెక్కలి రూరల్‌: మండలం పోలవరం గ్రామంలో గురువారం వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి డా.కిల్లికృపారాణి పాల్గొని గ్రామంలో సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ జండాను ఆవిష్కరించారు. గ్రామంలో పార్టీ నాయకులు, గృహసారధులతో కలిసి పర్యటించి రాష్ట్రానికి జగన్‌ ఎందుకు అవసరమో వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతాడ గణపతి, సిగిలిపల్లి మోహనరావు, బగాది హరి, ఆట్ల రాహుల్‌, గండి అప్పలరెడ్డి, కూర్మారావు, ధవళ లక్ష్మణరావు పాల్గొన్నారు.

 

➡️