సమస్యలపై అధికారులు దృష్టిసారించాలి

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న టైపిస్టుల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని టైపిస్టులు, స్టెనోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు

సమావేశంలో మాట్లాడుతున్న మణిప్రభ

  • టైపిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు పి.మణి

ప్రభప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న టైపిస్టుల సమస్యలను పరిష్కరించడానికి అధికారులు చొరవ చూపాలని టైపిస్టులు, స్టెనోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు పి.మణిప్రభ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర టైపిస్ట్‌లు, స్టెనోగ్రాఫర్ల సంఘం శ్రీకాకుళం డివిజన్‌ సమావేశాన్ని శ్రీకాకుళం ఎంపిడిఒ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం జిఒ నంబరు 69ని విడుదల చేసి టైపిస్టుల సమస్యలకు పరిష్కారం చూపిందని, జిల్లాస్థాయిలో మాత్రం టైపిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. జిఒ విడుదల చేసినా తిరిగి ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్‌ కోసం లేఖ రాయడం సరికాదన్నారు. నేటికీ టైపిస్టులు రెగ్యులర్‌ కాక, ప్రొబేషన్‌ పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టైపిస్టు నియమాకాల్లో కారుణ్య నియామకాలు, బ్యాక్‌ల్యాగ్‌, గ్రూప్‌-4 ద్వారా భర్తీ చేయాలన్నారు. జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వెంకటరామన్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

 

➡️