సమస్యాత్మక గ్రామాలపై దృష్టి

సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని

వజ్రపుకొత్తూరు : సూచనలు ఇస్తున్న ఎస్‌పి రాధిక

ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

వజ్రపుకొత్తూరు:

సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక పోలీసులకు ఆదేశించారు. మండలంలోని అక్కుపల్లి, బైపల్లి పోలింగ్‌ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. మారు మూల ప్రాంతాల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని వసతులపై ఆరా తీశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కి ఆదేశించాఉ. ఎటువంటి డాక్యుమెంట్‌ లేకుండా ఎవరైనా నగదుతో పట్టుబడితే వాటిని స్వాధీనం చేసుకొని ఎన్నికల నిబంధనలకు అనుసరించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమెతో పాటు కాశీబుగ్గ డిఎస్‌పి నాగేశ్వరరెడ్డి, రూరల్‌ సిఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సిహెచ్‌.రామారావు, ఎఎస్‌ఐ జిన్నారావు ఉన్నారు.పోలింగ్‌ కేంద్రం పరిశీలనపలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి తాళభద్ర పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక బుధవారం పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేవా? అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ పారినాయుడు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

 

➡️