ఎన్నికలపై నిఘా వ్యవస్థ ప్రత్యేక దృష్టి పెట్టాలి

Apr 27,2024 17:53

మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకులు బాల సుబ్రహ్మణ్యమ్‌

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌

సార్వత్రిక ఎన్నికలు దృష్ట్యా ఎన్నికల యంత్రాంగం విధి నిర్వహణలో మరింత కచ్చితత్వం, నిబద్దత కలిగి ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై నిఘా పెట్టాలని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజక వర్గ సాధారణ పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యమ్‌ స్పష్టం చేశారు. స్ధానిక కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం ఉదయం ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీసు పరిశీలకులు జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించారు. తొలుత కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియ లో భాగంగా జిల్లాలో చేపట్టిన ప్రణాళిక వివిధ బృందాలు నిర్వహిస్తున్న విధులు పై సమగ్ర సమాచారం అందజేశారు. జిల్లాలో 7 నియోజక వర్గాల పరిధిలో 1577 పొలింగ్‌ కేంద్రాల, 1623149 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. వాటిలో 19,754 దివ్యంగా ఓటర్లు, 8,294 మంది 85 ప్లస్‌ ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో 1577 పిఎస్‌ల్లో మౌలిక సదుపాయాలు అందు బాటులో ఉండేలా ఆర్‌ఒ, ఎఆర్‌ఒలు తనిఖీలు చేశారన్నారు. జిల్లాలో 21 మోడల్‌, రెండు యూత్‌, ఏడు మహిళా, రెండ వికలాంగ ఓటర్లు కోసం ప్రత్యేక పొలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 23 ఎమ్‌ సి సి బృందాలను నియ మించామన్నారు. సి విజిల్‌ యాప్‌ 600 కాల్స్‌ వచ్చాయని 457 పరిష్కరించామని, 128 కేవలం సమాచార సంబ ంధ మైనవన్నారు. సువిధా ద్వారా 968 అనుమతుల్లో 820 జారీ చేయగా 116 తిరస్కరించామన్నారు 32 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారులు, ఆయా విభాగాల నోడల్‌ అధికారులు సమగ్ర సమాచారాన్ని అందచేశారు.అనంతరం సాధారణ ఎన్నికల పరిశీలకులు కె. బాల సుబ్రహ్మణ్యమ్‌ మాట్లాడుతూ, ఎన్నికలను పారదర్శకంగా, ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటర్లు పెద్ద ఎత్తున పొలింగ్‌ కేంద్రాల కి వచ్చేలా స్వీప్‌ కార్యకలాపాలను చేపట్టాలన్నారు. పొలింగ్‌ రోజున ఆరు గంటలకు లైనలో నిలబడిన చివరి వ్యక్తి నుంచి స్లిప్‌ ఇచ్చి, వారందరూ ఓటు హక్కు వినియోగించడం కోసం ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఓటర్‌ స్లిప్స్‌ జారీ బిఎల్‌ఒలు వ్యక్తిగతంగా ఓటర్లకు అందచేయాలన్నారు. ఆర్‌ఒలు, బిఎల్‌ఒల పనితీరును పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ చేపడుతున్న కార్యకలాపాలు ముందస్తుగా రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందచెయ్యలన్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా, ఏప్రిల్‌ 30 న పోటిలో నిలిచే అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలన్నారు. మరో ఎన్నికల సాధారణ పరిశీలకులు కమల్‌ కాంత్‌ సరోఛ్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి చేయదగిన, చేయకూడని వాటిపై అవగాహన కల్పించడం కీలకం అన్నారు. ఆమేరకు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఓటర్ల స్లిప్‌లో కచ్చితంగా ఎపిక్‌ సంఖ్య మాత్రమే రాయాలని తెలిపారు. ఉచితాలి, నగదు పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై దృష్టి సారించాలన్నారు.పోలీసు పరిశీలకులు బలరామ్‌ మీనా మాట్లాడుతూ, స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతకట్టుదిట్టం చేయాలన్నారు. 24ఞ7 సిసి కెమెరాలు పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడడం, బ్యాక్‌ అప్‌ వ్యవస్థ ను ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు అనుగుణంగా ముందస్తుగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగు శాతం పై పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పించడం డచైతన్యం తీసుకుని రావాలని తెలిపారు. భద్రత పరంగా క్రిటికల్‌ పొలింగ్‌ కేంద్రాల వద్ద వీడియో గ్రాఫి నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మాధవీలత తెలియ చేశారు. వ్యయ పరిశీలకులు రోహిత్‌ నగర్‌, జై అరవింద్‌, నితిన్‌ కురియన్‌ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అభ్యర్ధులు చేసే ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ బందానికి అందజేయాలన్నారు. పత్రికల్లో, టివిల్లో, వివిధ సామాజిక మాధ్యమాల్లో వొచ్చే ప్రచారం ఖర్చులను, సువిధ అనుమతుల ఖర్చులను అందచెయ్యలన్నారు. ఆ ఖర్చులను అభ్యర్థుల ఖాతా లో చూపి, నోటీసు జారీ చేయాలన్నారు. ఎస్‌పి పి. జగదీష్‌ మాట్లాడుతూ, జిల్లాలో 16 సమీకత శాఖల ద్వారా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఎనిమిది సమీకత చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని, తదుపరి మరో ఎనిమిది చెక్‌ పోస్ట్‌లని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, రవాణా, అటవీ, సెబ్‌, ఎక్సైజ్‌ తదితర శాఖల ఆధ్వర్యంలో సమ్మిళితం చేసి ఏకీకృత శాఖల ఉద్యోగులు నియమించి నట్లు తెలిపారు. తనిఖీలు, సీజ్‌ చేసే విధానం వీడియో రికార్డింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రోహిత్‌ నగర్‌, జై అరవింద్‌, నితిన్‌ కురియన్‌ జై అరవింద్‌ , రిటర్నింగ్‌ అధికారులు, ఇతర నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

 

➡️