సిట్టింగ్‌లకే సీట్లు

శ్రీకాకుళం స్థానం నుంచి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును

పి.తిలక్‌, ఎంపీ అభ్యర్థి

రెండు చోట్ల మార్పులు

టెక్కలికి దువ్వాడ శ్రీనివాస్‌

ఇచ్ఛాఫురానికి పిరియా విజయ ఖరారు

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్‌అభ్యర్థులను ప్రకటించిన వైసిపిరాబోవు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను వైసిపి శనివారం విడుదల చేసింది. జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం ఎంపీ స్థానానికీ అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారిని మారుస్తారని ప్రచారం జరిగినా అటువంటి మార్పులేవీ చేయలేదు. ఐ ప్యాక్‌ సర్వేలు, ఇతర సంస్థల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా కొద్ది నెలలుగా నియోజకవర్గాలకు అభ్యర్థులను మారుస్తూ వచ్చిన వైసిపి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అభ్యర్థుల మార్పు, బదిలీలు బెడిసి కొట్టడటంతో ప్రయోగాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది.

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం

శ్రీకాకుళం స్థానం నుంచి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరును మళ్లీ పోటీ చేయనున్నారు. శనివారం వెలువడిన జాబితాలో పార్టీ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఇది మూడో సారి. 2014లో వైసిపి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి గుండ లక్ష్మీదేవి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో అదే పార్టీ నుంచి రంగంలోకి దిగి గుండ లక్ష్మీదేవిని ఓడించారు. మరోసారి ఇక్కడ నుంచి వైసిపి తరుపున బరిలో దిగనున్నారు. టిడిపి తరుపున ఎవరు పోటీ చేస్తారనేది ఇంకా తేల్లేదు. 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నుంచి శాసనసభ్యునిగా అధ్యక్షునిగా పనిచేశాడు. పలాస నుంచి రెండోసారిపశుసంవర్థక మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వైసిపిలో 2017లో వైసిపి సమన్వయకర్త బాధ్యతలను చేపట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి గౌతు శిరీషపై విజయం సాధించారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి రెండోసారి పోటీ పడనున్నారు. టిడిపి తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఆమదాలవలస టిక్కెట్‌ తమ్మినేనికే ఆమదాలవలస స్థానం నుంచి వైసిపి తరుపున శాసనస స్పీకర్‌ తమ్మినేని సీతారాం మళ్లీ రంగంలోకి దిగనున్నారు. 1983లో టిడిపిలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మాజీ విప్‌ కూన రవికుమార్‌ చేతిలో ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో కూన రవికుమార్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో వారిద్దరే మళ్లీ తలపడనున్నారు. అసమ్మతి ఉన్నా… రెడ్డి శాంతి వైపే మొగ్గుపాతపట్నం స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెడ్డి శాంతికే ఖరారైంది. 2014లో వైసిపి తరుపున శ్రీకాకుళం పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో పాతపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కలమట వెంకటరమణను ఓడించి తొలి విజయం సాధించారు. రెండోసారి ఇక్కడ నుంచే బరిలో దిగనున్నారు. టిడిపి ఎవరు పోటీ చేస్తారనేది తేల్లేదు.నరసన్నపేటకు మళ్లీ కృష్ణదాసేనరసన్నపేట స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మాన కృషదాస్‌ పేరును పార్టీ ఖరారు చేసింది. 2004, 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి తొలి సారి గెలుపొందారు. తర్వాత వైసిపిలో చేరి 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. టిడిపి బగ్గు రమణమూర్తికే సీటు ఖరారు చేయడంతో మళ్లీ వీరిద్దరే ఎన్నికల్లో తలపడనున్నారు. అనూహ్యంగా విజయకు అవకాశం ఇచ్ఛాపురం స్థానానికి జడ్‌పి చైర్‌పర్సన్‌ పిరియా విజయ పేరును పార్టీ ఖరారు చేసింది. ఈ ఏడాది జనవరి 11న పార్టీ ప్రకటించిన ఆరో జాబితాలో ఆనూహ్యంగా ఆమెకు సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఆమెకే సీటు కేటాయించింది. 2019 ఎన్నికల్లో ఆమె భర్త పిరియా సాయిరాజ్‌ ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. టిడిపి అభ్యర్థిగా మళ్లీ బెందాళం అశోక్‌ సీటు ఖరాయిన నేపథ్యంలో ఆయనతో పోటీ పడనున్నారు. కిరణ్‌కుమార్‌కే మళ్లీ అవకాశంఎచ్చెర్ల స్థానానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కే పార్టీ మళ్లీ అవకాశం కల్పించింది. ఆయనను పార్టీ 2013లో వైసిపి ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి కళావెంకటరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో అదే కళా వెంకటరావును ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక్కడ నుంచి టిడిపి తరుపున పోటీ చేసేది ఎవరనేది ప్రకటించాల్సి ఉంది. టెక్కలి నుంచి శ్రీనివాస్‌టెక్కలి స్థానానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అభ్యర్థితత్వం ఖరారైంది. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున తొలిసారి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో వైసిపి తరుపున పోటీ చేసి మళ్లీ అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. టెక్కలి వైసిపిలో అనేక మలుపులు చోటు చేసుకున్న తర్వాత మళ్లీ దువ్వాడకే పార్టీ అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే కింజరాపు అచ్చెనాయుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో ఆయనతో తలపడనున్నారు. ఎంపీ స్థానానికి తిలక్‌ ఖరారుశ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్‌ పేరును పార్టీ ఖరారు చేసింది. 2019 ఎన్నికల్లో వైసిపి తరుపున పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. 2104 ఎన్నికల్లో అనూహ్యంగా ఆయనకు ఎంపీ టికెట్‌ వరించింది. టిడిపి ఎంపీ అభ్యర్థిగా ఎవరినీ పార్టీ ప్రకటించకపోయినా మళ్లీ రామ్మోహన్‌ నాయుడే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

➡️